Sikkim: విరిగిన కొండచరియలు.. చిక్కుకు పోయిన 550 మంది పర్యాటకులు!

భారీ వర్షాల కారణంగా ఈశాన్య రాష్ట్రం సిక్కింలోని చుంగ్‌తాంగ్‌ మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దాదాపు 550 మంది పర్యాటకులు చిక్కుకు పోయారు.

Updated : 13 Oct 2022 22:42 IST

గ్యాంగ్‌టక్‌: భారీ వర్షాల కారణంగా ఈశాన్య రాష్ట్రం సిక్కింలోని చుంగ్‌తాంగ్‌ మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రహదారి దెబ్బతినండంతో 150 వాహనాల్లో దాదాపు 550 మందికి పైగా పర్యాటకులు చుంగ్‌తాంగ్‌-లాచుంగ్‌ మార్గంలో దాదాపు 12గంటల పాటు చిక్కుకుపోయినట్టు భారత సైన్యం వెల్లడించింది. పర్యాటకులకు అవసరమైన ఆహారపదార్థాలు, అత్యవసర వైద్యం అందిస్తున్నట్లు తెలిపింది. కొండచరియలు విరిగిపడిన కారణంగా దెబ్బతిన్న రహదారిని బోర్డర్‌ రోడ్‌ ఆర్గనైజేషన్‌ పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు, భారీ వర్షం, చలి కారణంగా పునరుద్ధరణ పనులకు ఆటంకం కలుగుతోందని, సిక్కిం ప్రభుత్వ యంత్రాంగం సహాయంతో పర్యాటకులను లాచుంగ్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సైన్యం వెల్లడించింది. సిక్కిం వ్యాప్తంగా మూడు చోట్లు భారీ కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఉత్తర సిక్కిం ప్రాంతానికి పర్యాటకులకు అనుమతిని తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని