Corona:హైఫై మాస్క్‌ వ్యాక్సిన్‌లా పనిచేస్తుంది

కరోనా వ్యాప్తిని అడ్డుకొనేందుకు ఉపయోగించే ప్రధాన ఆయుధం మాస్క్‌. ప్రస్తుత పరిస్థితుల్లో హైఫై మాస్క్‌ మరింత రక్షణ ఇస్తుందని వైరస్‌ నిరోధక వ్యూహ నిపుణులు దేవభక్తుని శ్రీ కృష్ణ సూచిస్తున్నారు.

Updated : 21 May 2021 11:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వ్యాప్తిని అడ్డుకొనేందుకు ఉపయోగించే ప్రధాన ఆయుధం మాస్క్‌. ప్రస్తుత పరిస్థితుల్లో హైఫై మాస్క్‌ మరింత రక్షణ ఇస్తుందని వైరస్‌ నిరోధక వ్యూహ నిపుణులు దేవభక్తుని శ్రీ కృష్ణ సూచిస్తున్నారు. 2014 నుంచి ఎబోలా మొదలు ఎన్నో వైరస్‌ల నియంత్రణలో కీలక పాత్ర వహించిన శ్రీ కృష్ణ ఇప్పుడు దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కరోనాను ఎలా కట్టడి చేయాలన్న అంశం మీద తన ఆలోచనలను ‘ఈటీవీ’తో పంచుకున్నారు.

హైఫై మాస్క్‌ అంటే ఏంటి? అవి ఎలా పనిచేస్తాయి?
హై లెవెల్‌ ఫిల్టరేషన్‌, హై ఫిట్‌ మాస్క్‌లను హైఫై మాస్కులు అని పిలుస్తారు. మనం మాట్లాడేటపుడు, గాలి పీల్చేటపుడు అతి చిన్న పార్టికల్స్‌ బయటకు వస్తాయి. ఆ పార్టికల్స్‌లో వైరస్‌ ఉంటే అది ఇతరులకు వ్యాపిస్తుంది. బహిరంగ ప్రదేశాల్లో కన్నా ఇండోర్‌లలో వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో హై ఫిల్టరేషన్‌, హైఫిట్‌ మాస్క్‌లను వాడటం వల్ల వైరస్‌ వ్యాపించకుండా ఉంటుంది. బట్టతో చేసిన మాస్క్‌ పెద్ద పార్టికల్స్‌ని మాత్రమే అడ్డుకోగలవు. 1 నుంచి 10 మైక్రాన్‌ సైజులో ఉన్న పార్టికల్స్‌ను బట్ట మాస్క్‌ అడ్డుకోలేదు. హైఫై మాస్క్‌లో ఉన్న ఎలక్ట్రోస్టాటికల్ చార్జ్‌ ఫిల్టర్‌ ఆ చిన్న చిన్న పార్టికల్స్‌ను సమర్థంగా అడ్డుకుంటుంది.

మాస్క్‌ పెట్టుకున్న వ్యక్తి వదిలిన గాలి మళ్లీ తానే పీల్చుతాడు. అది ఎంత వరకూ ఆరోగ్యకరం. దానికి ప్రత్యమ్నాయం ఏమైనా ఉందా?
బయట దొరికే సాధారణ మాస్క్‌ పెట్టుకోవడం వల్ల గాలి ఫిల్టర్‌ అవ్వదు. హైఫై మాస్క్‌ పెట్టుకుని గాలి పీల్చినపుడు పార్టికల్స్‌.. మాస్క్‌ లేయర్స్‌కు అతుక్కుపోతాయి. దాని వల్ల స్వచ్చమైన గాలి లభిస్తుంది. 

సెకండ్‌ వేవ్‌లో ఇమ్యూన్‌ సిస్టం బాగుంటే కరోనాను జయించవచ్చని అంటున్నారు డాక్టర్లు. దీని మీద మీ అభిప్రాయం?
ఇది కొంత వరకూ నిజమే. ఇమ్యూన్‌ సిస్టం బాగున్న వాళ్లకు వైరస్‌ సోకితే త్వరగానే కోలుకుంటున్నారు. అయితే ఒక సారి కరోనా సోకితే ఇమ్యూన్‌ సిస్టం పాడయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి వైరస్‌ సోకకుండా ఉండటానికి హైఫై మాస్క్‌ పెట్టుకోవాలి. హైఫై మాస్క్‌ అనేది ఒక రకంగా వ్యాక్సిన్‌లా పనిచేస్తుంది.

డబుల్ మాస్క్‌ ధరిచండం సురక్షితమేనా? రెండు సర్జికల్‌ మాస్కులు పెట్టుకోవచ్చా?
పెట్టుకోవచ్చు.. అయితే ఎన్‌95 అందుబాటులో లేకపోతే డబుల్‌ మాస్క్‌ పెట్టుకోవాలి. కొంతమంది సర్జికల్‌ మాస్క్‌, క్లాత్‌ మాస్క్‌ పెట్టుకుంటారు. అలాంటి వాళ్లు తప్పని సరిగా సర్జికల్‌ మాస్క్‌ మీద క్లాత్‌ మాస్క్‌ పెట్టుకోవాలి. డబుల్‌ మాస్కులు ధరిస్తే 75 శాతం మాత్రమే వైరస్‌ నుంచి రక్షణ ఉంటుంది.

కరోనా సెకండ్‌ వేవ్‌లో పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
పిల్లలైనా, పెద్దలైనా ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్‌ సోకకుండా ఉండాలంటే హైఫై మాస్క్‌ పెట్టుకోవాలి. పిల్లలకు కొన్ని ప్రత్యేకమైన హైఫై మాస్క్‌లు ఉన్నాయి. అవి వాడటంవల్ల  శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉండవు. 

హైఫై మాస్క్‌లు ఎక్కడ దొరుకుతాయి?
ప్రస్తుతం చాలా రకాల మాస్కులు మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఎన్‌95, కొరియా మాస్క్‌ కేఎఫ్‌ 94, ఐరోపా మాస్క్‌ ఎఫ్‌ఎఫ్‌పి-2 వంటి మాస్క్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటి గురించి పూర్తి సమాచారం Patient Knowhow వెబ్‌సైట్‌ చూడొచ్చు.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts