IBPS PO results: ఐబీపీఎస్ పీవో మెయిన్స్‌-2022 ఫలితాలు విడుదల

ఐబీపీఎస్‌ మెయిన్స్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.

Updated : 05 Jan 2023 22:01 IST

దిల్లీ: వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6,932 ప్రొబేషనరీ ఆఫీసర్(Probationary Officers), మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(సీఆర్‌పీ పీవో/ఎంటీ-XII) ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ఐబీపీఎస్‌ మెయిన్స్‌ ఫలితాలు(IBPS Mains Results) విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్(IBPS) గురువారం (జనవరి 5న) విడుదల చేసింది. దేశవ్యాప్తంగా పీవో నియామక ప్రధాన పరీక్షలు నవంబర్‌ 26న ఐబీపీఎస్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఫలితాలను జనవరి 16వరకు తమ అధికారిక వెబ్‌సైట్‌(https://ibps.in/)లో చూసుకోవచ్చని తెలిపింది.  పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్ నమోదు చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకు కాల్‌ లెటర్లు జనవరి లేదా ఫిబ్రవరిలో వచ్చే అవకాశం ఉంది. 

ఐబీపీఎస్‌ పీవో ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని