G20 Summit: దిల్లీ ఎయిర్‌పోర్టులో ఐఎంఎఫ్‌ చీఫ్‌.. జానపద పాటకు డ్యాన్స్‌

G20 Summit: జీ-20 సదస్సు కోసం భారత్‌ వచ్చిన ఐఎంఎఫ్‌ చీఫ్‌.. ఎయిర్‌పోర్టులో డ్యాన్స్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

Published : 08 Sep 2023 15:13 IST

దిల్లీ: భారత్‌ అధ్యక్షతన జరగనున్న జీ-20 సదస్సు (G20 Summit)కు హాజరయ్యేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) సంస్థ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టాలినా జార్జివా (Kristalina Georgieva) దిల్లీకి విచ్చేశారు. గురువారం రాత్రి దేశ రాజధానికి చేరుకున్న ఆమెకు భారత అధికారులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమెను ఆహ్వానించేందుకు దిల్లీ ఎయిర్‌పోర్టు (Delhi Airport)లో ప్రత్యేక సాంస్కృతిక నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆ ప్రదర్శనను వీక్షించిన క్రిస్టాలినా కూడా సరదాగా కాలుకదిపారు.

ఒడిశా జానపద పాటకు కళకారులు నృత్యం చేస్తుండగా ఐఎంఎఫ్‌ చీఫ్‌ (IMF Chief Dance) కూడా వారిని అనుకరించే ప్రయత్నం చేశారు. వారిని చూస్తూ ఆమె స్టెప్పులు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘‘మన సంస్కృతికి, మన కళలకు ఉన్న బలం అలాంటిది’’ అని కొందరు నెటిజన్లు రాసుకొచ్చారు. ‘‘అంత గొప్ప స్థాయిలో ఉన్న ఆమె.. చాలా నిరాడంబరంగా ఉండటం హృదయాలను హత్తుకుంటోంది’’ అని ఐఎంఎఫ్‌ చీఫ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని