అమిత్‌ షా నకిలీ వీడియో కేసు.. గుజరాత్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మేవానీ పీఏ అరెస్టు

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నకిలీ వీడియోను ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశారన్న ఆరోపణలపై ఓ కాంగ్రెస్‌ నేతను, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కార్యకర్తను అరెస్టు చేసినట్లు గుజరాత్‌ పోలీసులు మంగళవారం వెల్లడించారు.

Published : 01 May 2024 03:20 IST

అహ్మదాబాద్‌, ముంబయి, దిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నకిలీ వీడియోను ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశారన్న ఆరోపణలపై ఓ కాంగ్రెస్‌ నేతను, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కార్యకర్తను అరెస్టు చేసినట్లు గుజరాత్‌ పోలీసులు మంగళవారం వెల్లడించారు. అరెస్టు అయిన వారిని బనాస్‌కాంఠలోని పలన్‌పుర్‌కు చెందిన సతీశ్‌ వన్‌సోలా, దహోద్‌ జిల్లా లింఖేడా పట్టణానికి చెందిన రాకేశ్‌ బారియాగా గుర్తించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవానీ వ్యక్తిగత సహాయకుడి(పీఏ)గా వన్‌సోలా గత ఆరేళ్లుగా పనిచేస్తున్నారు. ఆప్‌ దహోద్‌ జిల్లా అధ్యక్షుడిగా నాలుగేళ్లుగా రాకేశ్‌ వ్యవహరిస్తున్నారు. నిందితులిద్దరిపై ఐపీసీలోని 153ఏ సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. ఈ అరెస్టుపై ఎమ్మెల్యే మేవానీ స్పందిస్తూ.. ‘‘భాజపా ఐటీ విభాగం చాలాకాలంగా నకిలీ వీడియోలను వ్యాప్తి చేస్తోంది. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా సామాన్యులను అరెస్టు చేస్తున్నారు. సతీశ్‌ పొరపాటుగానే ఆ వీడియోను షేర్‌ చేశాడు’’ అని తెలిపారు. ఇదే కేసులో  మహారాష్ట్ర యువజన కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా, మరో 16 మందిపైనా ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు.  .

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని