India Corona: 13 వేల కొత్త కేసులు.. 12 వేల రికవరీలు..!

స్వల్పహెచ్చుతగ్గులతో దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 4.51 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 13,086 మందికి పాజిటివ్‌గా తేలింది.

Published : 05 Jul 2022 10:08 IST

దిల్లీ: స్వల్పహెచ్చుతగ్గులతో దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 4.51 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 13,086 మందికి పాజిటివ్‌గా తేలింది. దాంతో పాజిటివిటీ రేటు 2.90 శాతంగా నమోదైంది. ముందురోజు 16వేల కేసులు రాగా.. తాజాగా ఆ సంఖ్య తగ్గుముఖం పట్టింది. క్రియాశీల కేసులు 1,14,475(0.26)కి చేరాయి. నిన్న 12,456 మంది కోలుకోగా.. రికవరీ రేటు 98.53 శాతానికి తగ్గిపోయింది. ఈ రెండేళ్ల కాలంలో 4.35 కోట్ల మందికి పైగా కరోనా బారినపడగా.. 4.28 కోట్ల మందికి పైగా వైరస్‌ను జయించారు. 24 గంటల వ్యవధిలో 24 మంది ప్రాణాలు కోల్పోయారని మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక గత ఏడాది ప్రారంభం నుంచి 198 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి. దేశ జనాభాలో 90 శాతం మంది వయోజనులకు పూర్తిస్థాయి టీకా అందినట్లు నిన్న కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని