Corona: కొత్త కేసులు 31,222.. రికవరీలు 42,942
దేశంలో కరోనా కేసులు, మరణాలు భారీగా తగ్గడం ఊరటనిస్తోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 31వేల మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అవగా.. మరణాలు
300 దిగువకు మరణాలు
దిల్లీ: దేశంలో కరోనా కేసులు, మరణాలు భారీగా తగ్గడం ఊరటనిస్తోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 31వేల మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అవగా.. మరణాలు 300 దిగువకు తగ్గాయి. ఇక వరుసగా రెండో రోజు కొత్త కేసుల కంటే కోలుకున్నవారే ఎక్కువగా ఉండటం సానుకూలాంశం.
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 15 లక్షలకుపైగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 31,222 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.30కోట్లు దాటింది. ఇదే సమయంలో 42,942 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 3.22కోట్ల మందికి పైగా కరోనాను జయించగా.. రికవరీ రేటు 97.48శాతంగా ఉంది. అటు కేరళలోనూ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఆ రాష్ట్రంలో నిన్న 19,688 కేసులు, 135 మరణాలు నమోదయ్యాయి.
మరోవైపు నిన్న 290 మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 4,41,042 మందిని మహమ్మారి బలితీసుకుంది. ఇక కొత్త కేసులు తగ్గుముఖం పట్టడంతో క్రియాశీల కేసుల సంఖ్య మరోసారి 4లక్షల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,92,864 మంది వైరస్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 1.19శాతంగా ఉంది.
70కోట్లకు చేరువలో వ్యాక్సినేషన్..
ఇక దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరాయంగా సాగుతోంది. సోమవారం మరోసారి కోటిమందికి పైగా(1.13కోట్లు) ప్రజలకు టీకాలు వేశారు. ఇప్పటివరకు 69.90కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
చంద్రబాబు గొప్ప నాయకుడు.. భాజపా పెద్దల్ని ఎందుకు కలిశారో ఆయన్నే అడగండి: సోము వీర్రాజు
-
Sports News
WTC Final: భారత్ ఈ రోజు పుంజుకోకుంటే..
-
Crime News
Kakinada: ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బైక్.. ముగ్గురి మృతి
-
India News
Padmini Dian: పొలం పనుల్లో మహిళా ఎమ్మెల్యే
-
Crime News
Couple Suicide: కుటుంబంలో మద్యం చిచ్చు.. భార్యాభర్తల ఆత్మహత్య
-
India News
నా భర్త కళ్లలో చెదరని నిశ్చలత చూశా