Jammu and Kashmir: న్యాయం జరిగే వరకు టార్గెట్ హత్యలు ఆగవు: ఫరూఖ్ అబ్దుల్లా
కశ్మీర్‌లో న్యాయం జరగకపోతే టార్గెట్ హత్యలు ఆగవని మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా పేర్కొన్నారు.
ఇంటర్నెట్‌డెస్క్: కశ్మీర్‌లో న్యాయం జరగకపోతే టార్గెట్ హత్యలు ఆగవని మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా పేర్కొన్నారు. ఇటీవల దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో మైనార్టీలైన పండిట్ వర్గానికి చెందిన పూర్ణ కృష్ణ భట్ హత్యకు ఆర్టికల్ 370 తొలగింపే ఓ రకంగా కారణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఫరూఖ్ మాట్లాడుతూ ‘‘న్యాయం జరిగే వరకు ఇవి ఆగవు. గతంలో వారు ఆర్టికల్ 370 ఉండటం వల్లే ఇటువంటి హత్యలు జరిగాయని చెప్పారు. ఇప్పుడు దానిని తొలగించారు. కానీ, హత్యలు మాత్రం ఎందుకు ఆగలేదు? దీనికి ఎవరు బాధ్యులు..?’’ అని అబ్దుల్లా ప్రశ్నించారు.
శనివారం ఉదయం పూర్ణ కృష్ణ భట్‌ను షోపియాన్ జిల్లాలోని ఆయన పూర్వీకుల ఇంటి వద్ద ఉగ్రవాదులు కాల్చారు. తూటా గాయాలతో ఉన్న ఆయన్ను జిల్లా ఆసుపత్రి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఈ దాడికి కశ్మీర్ ఫ్రీడమ్ ఫైటర్స్ బాధ్యత తీసుకొంది. ఆయన మృతదేహానికి ఆదివారం ఉదయం జమ్ములో అంత్యక్రియలు జరిగాయి. మృతుడికి భార్య, పాఠశాల విద్యాభ్యాసం చేస్తున్న కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ క్రమంలో కశ్మీర్‌లో టార్గెట్ హత్యలపై అక్కడి మైనార్టీ వర్గాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. కశ్మీర్‌లో హిందువులు సురక్షితంగా లేరని కృష్ణ భట్ సోదరి నీలమ్ మీడియా వద్ద ఆందోళన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Nobel Prize: రసాయన శాస్త్రంలో నోబెల్ వీరికే.. ప్రకటనకు ముందే ‘లీకుల’ కలకలం..!
-
Harmilan Bains: 13 ఏళ్ల వయసులోనే నిషేధం... ఆపై వరుస గాయాలు.. హర్మిలన్ పోరాటమిదీ!
-
Meta: మెటాలో మరోసారి ఉద్యోగుల తొలగింపు..!
-
Rajeshwari Kumari: అప్పుడు తండ్రి.. ఇప్పుడు తనయ... రజత పతకధారి రాజేశ్వరి కథ ఇదీ!
-
HarishRao: మాటలు చెప్పే సర్కార్ కావాలా? చేతల సర్కార్ కావాలా?: హరీశ్‌రావు
-
TDP: రోజా ఇష్టం వచ్చినట్లు మాట్లాడినందునే బుద్ధి చెప్పా: బండారు