Lalu Prasad Yadav: లాలూకు అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స!

ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలో రాజేంద్ర....

Published : 22 Feb 2022 01:40 IST

రాంచీ: ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలో రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గానే ఉన్నప్పటికీ ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు, గతంలో బిహార్‌ రాష్ట్రాన్ని కుదిపేసిన దాణా కుంభకోణంలో చిట్టచివరిది, అయిదోది అయిన డొరండా ఖజానా కేసులో లాలూకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈరోజు ఆయనకు ఐదేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. అలాగే, రూ.60 లక్షల జరిమానా కూడా విధించింది. లాలూతో పాటు మరో 99 మంది నిందితులపై విచారణ జరిపిన రాంచీలోని న్యాయస్థానం..  జనవరి 29న తీర్పును రిజర్వులో ఉంచగా.. గత మంగళవారం ఈ కేసులో లాలూను దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. తాజాగా సోమవారం తుది తీర్పును వెల్లడించిన న్యాయస్థానం ఈ కేసులో మరో 46 మందికి కోర్టు మూడేళ్ల జైలు శిక్షను విధించింది. 24 మందిని నిర్దోషులుగా తేల్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని