BR Ambedkar: రాజ్యాంగ నిర్మాతకు రాష్ట్రపతి, ప్రధాని ఘన నివాళి..!

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ (Dr BR Ambedkar) వర్థంతి సందర్భంగా నేడు పలువురు నాయకులు ఆయనకు నివాళులర్పించారు.

Updated : 06 Dec 2022 11:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ (Dr BR Ambedkar) 64వ వర్థంతిని దేశవ్యాప్తంగా ‘మహా పరినిర్వాన్‌ దివస్‌’(Mahaparinirvan Diwas)గా నిర్వహిస్తున్నారు. ఆయన దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు గుర్తు చేసుకొన్నారు. పార్లమెంట్‌ ఆవరణలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(Droupadi Murmu), ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌కడ్‌(Jagdeep Dhankar), ప్రధాని మోదీ(modi), లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తదితరులు నివాళులు అర్పించారు.

‘‘మహా పరినిర్వాన్‌ దివస్ సందర్భంగా డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌కు నివాళులర్పించాను. ఆయన లక్షల మందిలో ఆశలు చిగురించేందుకు శ్రమించారు. భారత్‌ ఎన్నటికీ మర్చిపోలేని ఆదర్శప్రాయమైన రాజ్యాంగాన్ని అందించేందుకు కృషి చేశారు’’ అని ప్రధాని మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు.

స్పీకర్‌ ఓం బిర్లా కూడా అంబేడ్కర్‌కు నివాళులర్పిస్తూ ట్వీట్‌ చేశారు.‘‘సమాజంలో సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ ఉండేలా ప్రజాస్వామ్య సాధికారతకు అవసరమైన అమూల్యా రాజ్యాంగాన్ని అందించారు’’ అని పేర్కొన్నారు. 

ప్రతిపక్ష కాంగ్రెస్‌ నాయకులు కూడా పార్లమెంట్‌(Parliament) ఆవరణలోని అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు సోనియా గాంధీ(Sonia Gandhi), మల్లిఖార్జున్‌ ఖర్గే(Mallikarjun Kharge), అధిర్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.






Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని