సచిన్‌ వాజే సహచరుడి అరెస్టు

ముఖేశ్‌ అంబానీ ఇంటి వద్ద జెలిటెన్‌ స్టిక్స్‌ పెట్టిన కేసు నాటకీయగా మలుపులు తిరుగుతోంది. తాజాగా సచిన్‌ వాజేతో కలిసి గతంలో ఎన్‌కౌంటర్లలో పాల్గొన ఓ కానిస్టేబుల్‌ను, ఒక బుకీని అరెస్టు చేశారు.

Updated : 21 Mar 2021 15:00 IST

మన్‌సుఖ్‌ హత్యకేసులో మరో మలుపు

ఇంటర్నెట్‌డెస్క్‌: ముఖేశ్‌ అంబానీ ఇంటి వద్ద జెలిటెన్‌ స్టిక్స్‌ పెట్టిన కేసు నాటకీయ మలుపులు తిరుగుతోంది. తాజాగా సచిన్‌ వాజేతో కలిసి గతంలో ఎన్‌కౌంటర్లలో పాల్గొన్న ఓ కానిస్టేబుల్‌ను, ఒక బుకీని అరెస్టు చేశారు. మనసుఖ్‌ హిరేన్‌ హత్య  కేసులో వీరిని అదుపులోకి తీసుకొన్నట్లు మహారాష్ట్ర ఏటీఎస్ చెబుతోంది. ఇప్పటికే మన్‌సుఖ్‌ హత్య కేసు దర్యాప్తు కూడా ఎన్‌ఐఏకి అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటి వరకు ఈ కేసును విచారించిన ఏటీస్‌ దర్యాప్తు వివరాలను ఎన్‌ఐఏకు అప్పగించనున్నారు.

ఈ నేపథ్యంలో శనివారం సస్పెన్షన్‌లో ఉన్న ముంబయి  పోలీస్‌ కానిస్టేబుల్‌ వినాయక్‌ షిండే (55), బుకీ నరేష్‌ ధార్‌ను ఏటీఎస్‌ బృందం అదుపులోకి తీసుకొంది. వీరిలో వినాయక్‌ షిండే ముంబయి ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు ప్రదీప్‌ శర్మ బృందంలో కానిస్టేబుల్‌గా పనిచేశారు. అదే బృందంలో సచిన్‌ వాజే కూడా పనిచేశారు. 2006లో ఛోటా రాజన్‌ అనుచరుడు లఖన్‌ భయ్య(రామ్‌నారాయణ్‌ గుప్తా) ఎన్‌కౌంటర్‌ కేసులో వినాయక్‌ సస్పెండ్‌ అయ్యాడు. 2013లో సెషన్స్‌ కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించింది. ప్రస్తుతం పెరోల్‌పై బయట ఉన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని