Published : 06 Jul 2022 15:57 IST

Mahua Moitra: ‘కాళీ’ వివాదం.. మహువాపై కేసు నమోదు..!

కోల్‌కతా: మతపరమైన వ్యాఖ్యలు చేసిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై కేసు నమోదైంది. ఒక సినిమా పోస్టర్‌ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఆమెను అరెస్టు చేయాలని భాజపా నేతలు ఫిర్యాదు చేశారు. ఆ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కోల్‌కతాలో నిరసన చేపట్టడమే కాకుండా టీఎంసీ నుంచి ఆమెను సస్పెండ్‌ చేయాలని ఆందోళన చేపట్టారు.

మరోపక్క తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడానికి మహువా నిరాకరించారు. బెంగాలీలు ఆరాధించే దేవతామూర్తి నిర్భయమైందంటూ ట్వీట్ చేశారు. ‘నేను కూడా కాళీ మాత ఆరాధకురాలినే. మీ గుండాలకు, మీ పోలీసులకు, మరీ ముఖ్యంగా మీ ట్రోల్స్‌కు.. నేను దేనికీ భయపడను. నిజం చెప్పేందుకు ఇతర శక్తుల మద్దతు అవసరం లేదు’ అంటూ గట్టిగా బదులిచ్చారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ నేత శశిథరూర్ ఆమెకు మద్దతుగా నిలిచారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరికీ తెలిసినవే అయినా.. ప్రస్తుతం వస్తోన్న విమర్శలు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయని వ్యాఖ్యానించారు. 

అసలు వివాదం ఏంటంటే..?

మంగళవారం జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ మహువా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దర్శకురాలు, రచయిత్రి, నటి లీనా మణిమేగలై తన తాజా చిత్రం ‘కాళీ’కి సంబంధించి ఇటీవల విడుదల చేసిన పోస్టర్‌ తీవ్ర వివాదాస్పదంగా మారింది. దానిపై అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించిన తీరుకు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సొంత పార్టీ కూడా ఆమె మాటలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. వాటితో తమకూ ఏ సంబంధం లేదంటూ దూరం జరిగింది. తన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం కావడంతో మహువా స్పందించారు. తాను ఏ చిత్రానికి, ఏ పోస్టర్‌కు మద్దతు ఇవ్వలేదన్నారు. తాను ధూమపానం అనే పదాన్ని వాడలేదని వివరణ ఇచ్చారు. ఈ పరిణామాల మధ్యనే ఆమె టీఎంసీ అధికారిక ట్విటర్ ఖాతాను అన్‌ఫాలో చేయడం చర్చనీయాంశంగా మారింది. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని