రహదారుల దిగ్బంధానికి రైతు సంఘాల పిలుపు 

ఈ నెల 6న దేశవ్యాప్త నిరసనలకు రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు ......

Published : 01 Feb 2021 21:52 IST

దిల్లీ: ఈనెల 6న దేశవ్యాప్త నిరసనలకు రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ శనివారం మధ్యాహ్నం మూడు గంటల పాటు జాతీయ రహదారుల దిగ్బంధించాలని సంయుక్త కిసాన్‌ మోర్చా విజ్ఞప్తి చేసింది. ఈ నెల 6వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి 3గంటల వరకు జాతీయ, రాష్ట్ర రహదారులను దిగ్బంధించాలని నేతలు పిలుపునిచ్చారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతు సంఘాలు రెండు నెలలకు పైగా దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

ఇదీ చదవండి..

దిల్లీ సరిహద్దుల్లో ఇంటర్నెట్‌ నిషేధం పొడిగింపు

మడమతిప్పని పోరాటం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని