Gujarat Tragedy: ఇంకా వందమంది ఆచూకీ తెలియలేదు..!

గుజరాత్‌కు చెందిన ఒరెవా గ్రూప్‌ ఈ వంతెన మరమ్మతులు చేపట్టింది. ఈ ఘటన నేపథ్యంలో ఆ సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులను అరెస్టు చేసినట్లు సమాచారం.

Updated : 31 Oct 2022 18:53 IST

దిల్లీ: గుజరాత్‌లో మోర్బీ ప్రాంతంలో జరిగిన తీగల వంతెన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. 130 మందికి పైగా మరణించారు. ఇంకా దాదాపు వందమంది గల్లంతు అయ్యుంటారని అధికారులు అనుమానిస్తున్నారు. వారి మృతదేహాలు బురద నీటిలో చిక్కుకుపోయి ఉంటాయని అనుమానిస్తున్నారు. ఇక ఈ రోజుకు సహాయక చర్యలు నిలిపివేశారు. రేపు ఉదయం తిరిగి వాటిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే ఫోరెన్సిక్ వర్గాలు ఘటనకు గల కారణాలు వెల్లడించాయి. కొత్త ప్రారంభించిన బ్రిడ్జ్‌పైకి భారీ సంఖ్యలో ప్రజలు రావడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా వెల్లడించాయి. 

నలుగురి ఉద్యోగుల అరెస్టు..?

గుజరాత్‌కు చెందిన ఒరెవా గ్రూప్‌ ఈ వంతెన మరమ్మతులు చేపట్టింది. ఈ ఘటన నేపథ్యంలో ఆ సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులను అరెస్టు చేసినట్లు సమాచారం. సీఎఫ్‌ఎల్‌ బల్బులు, గోడ గడియారాలు, ఈ-బైక్‌లు తయారు చేసే కంపెనీగా పేరొందిన ఈ సంస్థకు నిర్మాణ రంగంలో అసలు అనుభవమే లేకపోవడం గమనార్హం. అలాంటి కంపెనీకి వందేళ్ల పురాతన బ్రిడ్జి మరమ్మతు, నిర్వహణకు సంబంధించిన కాంట్రాక్ట్‌ ఎలా దక్కిందన్నదానిపై ఇప్పుడు ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ‘ప్రజలు ఈ వంతెన పరిసరాలకు ఎలాంటి నష్టం కలిగించకుండా బాధ్యాతాయుతంగా వ్యవహరిస్తే.. ఇది 15 ఏళ్లపాటు మనగలదు’ అని వంతెన పున: ప్రారంభానికి కొద్దిరోజుల ముందు ఒరెవా గ్రూప్‌ ఎండీ జయ్‌సుఖ్‌భాయ్ పటేల్ ప్రకటించడం గమనార్హం.. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని