Rains: ఇది నది కాదు.. మా ఇంటి బేస్‌మెంట్‌..!

బెంగళూరులో కురిసిన వర్షాలతో పలు ప్రాంతాల్లో విద్యుత్ నిలిచిపోయింది. వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు.

Published : 21 Oct 2022 01:54 IST

బెంగళూరు: మహానగరం బెంగళూరు మరోసారి భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరి అయింది. బుధవారం రాత్రి కురిసిన వర్షాలతో అక్కడి ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. భవనాల బేస్‌మెంట్లు వరదనీటితో నిండిపోయాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ నిలిచిపోయింది. వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. వాతావరణ విభాగం ఆరెంజ్‌ అలర్ట్ జారీ చేసి, ప్రజలను హెచ్చరించింది. ఈ వానలతో తాము ఎదుర్కొన్న ఇబ్బందులు, వరద నీటితో నిండిన ప్రాంతాలను కొందరు నెట్టింట్లో షేర్‌ చేశారు. 

ఓ వీడియోలో అపార్ట్‌మెంట్ బేస్‌మెంట్ అంతా వరదనీటితో పొంగిపొర్లింది. ‘అది నది కాదు. మా ఇంటి కింద ఉన్న బేస్‌మెంట్ పరిస్థితి అది’ అని ఓ నెటిజన్ వీడియో షేర్ చేశారు. ‘నిర్మాణం సమయంలో ప్లానింగ్ లేకపోతే ఇలాగే అవుతుంది’, ‘దీనిని ఒక సరస్సుపై నిర్మించి ఉంటారు’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని