Vaccination: 15-18 ఏళ్లవారిలో 70 శాతానికిపైగా ఫస్ట్‌ డోస్‌ పూర్తి

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఈ క్రమంలో 15-18 ఏళ్లలోపువారిలో ఇప్పటివరకు 70 శాతానికిపైగా మొదటి డోసు తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఆదివారం వెల్లడించారు. 'ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను...

Published : 14 Feb 2022 01:08 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఈ క్రమంలో 15-18 ఏళ్లలోపువారిలో ఇప్పటివరకు 70 శాతానికిపైగా మొదటి డోసు తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఆదివారం వెల్లడించారు. 'ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను యంగ్ ఇండియా మరింత బలోపేతం చేస్తోంది. 15-18 ఏళ్లలోపువారిలో 70 శాతానికిపైగా మంది తమ మొదటి డోస్ పొందారు. అర్హులందరూ వీలైనంత త్వరగా టీకాలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా' అని మాండవీయ ట్వీట్‌ చేశారు.

భారత్‌లో జనవరి 3 నుంచి 15-18 ఏళ్లలోపువారికి టీకాలు వేయడం ప్రారంభమైన విషయం తెలిసిందే. అధికారిక గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం దేశంలో ఈ వయస్సువారి సంఖ్య దాదాపు 7.4 కోట్లు. ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం.. వీరిలో 1.47 కోట్ల మందికి రెండు డోసులూ పూర్తయ్యాయి. మరోవైపు.. ఆదివారం ఉదయం నాటికి మొత్తం 172.81 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేశారు. నిపుణుల బృందం సిఫార్సులు అందిన వెంటనే 5-15 ఏళ్లలోపు పిల్లలకూ టీకాలు అందజేస్తామని మంత్రి మాండవీయ శనివారం వెల్లడించిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని