
Updated : 17 Jan 2022 12:56 IST
Birju Maharaj: ప్రముఖ కథక్ కళాకారుడు పండిట్ బిర్జూ మహారాజ్ కన్నుమూత
దిల్లీ: ప్రముఖ కథక్ కళాకారుడు పండిట్ బిర్జూ మహారాజ్ (83) కన్నుమూశారు. బిర్జూ మహారాజ్ దేశ, విదేశాల్లో ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. కళాశ్రమం పేరుతో దిల్లీలో నృత్య పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఉమ్రాన్ జాన్, దేవదాస్, బాజీరావు మస్తానీ బాలీవుడ్ చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. బిర్జూ మహారాజ్ 1986లో పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు.
Tags :