Petrol Diesel Prices: దేశ వ్యాప్తంగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

హైదరాబాద్‌లో పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగాయి.  

Updated : 22 Mar 2022 09:44 IST

హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. దాదాపు ఐదు నెలల తర్వాత చమురు సంస్థలు ధరలను పెంచాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. తెలంగాణలో లీటర్‌ పెట్రోల్‌పై 90పైసలు, డీజిల్‌పై 87పైసలు పెంచారు. దీంతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.109.10, డీజిల్‌ రూ95.40పైసలకు చేరింది. ఏపీలో పెట్రోల్‌పై 88 పైసలు, డీజిల్‌పై 83 పైసలు పెరిగింది. దీంతో విజయవాడలో పెట్రోల్‌ రూ.110.80, డీజిల్‌ రూ.96.83గా ఉంది. గుంటూరులో పెట్రోల్‌ రూ.111.21, డీజిల్‌ రూ.97.26కు చేరింది.

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా ఇటీవల అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు గరిష్టానికి చేరుకున్న సంగతి తెలిసిందే.  అయితే రోజురోజుకు చమురు సంస్థల నష్టాలు పెరుగుతుండడంతో పెట్రోలు, డీజిల్‌ ధరలను పెంచడం అనివార్యంగా మారినట్లు అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరికొన్ని రోజుల పాటు చమురు ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని