Shashi Tharoor: మస్క్‌ ‘ట్విటర్‌’కు థరూర్‌ హెచ్చరిక..!

సామాజిక మాధ్యమం ట్విటర్‌ను ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్‌ మస్క్‌ కొనుగోలు చేసిన దగ్గరి నుంచి ప్రపంచవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Published : 27 Apr 2022 15:16 IST

దిల్లీ: సామాజిక మాధ్యమం ట్విటర్‌ను ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్‌ మస్క్‌ కొనుగోలు చేసిన దగ్గరి నుంచి ప్రపంచవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన నేతృత్వంలో ట్విటర్‌లో విద్వేష ప్రసంగాలు పెరిగే అవకాశం ఉండొచ్చనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్‌ కూడా ఇదే విషయమై ట్విటర్ కొత్త యజమానిని హెచ్చరించారు. 

‘ఈ సంస్థను ఎవరు కొనుగోలు చేశారన్నది ఇక్కడ ముఖ్యం కాదు. దానిని ఎలా నడిపిస్తారన్నదే ఇక్కడ ముఖ్యం. ట్విటర్‌ భారత్‌లో వాక్‌ స్వాతంత్య్రానికి ఆటంకం కలిగిస్తుందని గుర్తించినా, లేక విద్వేషపూరిత ప్రసంగం, దుర్వినియోగానికి అనుమతించినట్లు కనుగొన్నా.. వెంటనే ఐటీ కమిటీ చర్యలు తీసుకోవాలి’ అంటూ వ్యాఖ్యానించారు. 

ట్విటర్‌ కొనుగోలు చేయాలన్న ఆలోచన వచ్చినప్పటినుంచి వాక్‌ స్వాతంత్య్రం గురించి మాట్లాడుతోన్న మస్క్‌.. తాజాగా ఆ పదంపై స్పష్టత ఇచ్చారు. ‘ఫ్రీ స్పీచ్’ అనేది చట్టానికి లోబడి ఉండాలనేదే తన అభిప్రాయమని, చట్టానికి మించిన సెన్సార్‌ షిప్‌ను తాను వ్యతిరేకిస్తానని తాజాగా మస్క్‌ వివరణ ఇచ్చారు. ఇక, ట్విటర్‌ను 44 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసేందుకు మస్క్‌ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో అంతర్జాతీయ సాంకేతిక రంగంలోనే, మూడో అతిపెద్ద కొనుగోలు లావాదేవీగా ఇది నిలిచింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని