ఆ ఆరు రాష్ట్రాల్లోనే 61శాతం రికవరీలు!

దేశంలో ప్రతిరోజు కరోనా కొత్త కేసులు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. అయితే, అంతకంటే ఎక్కవ మంది కోలుకుంటుండడం ఊరట కలిగిస్తోంది. ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో 53,370 కొత్త కేసులు నమోదుకాగా.............

Published : 25 Oct 2020 02:14 IST

దిల్లీ: దేశంలో ప్రతిరోజు కరోనా కొత్త కేసులు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. అయితే, అంతకంటే ఎక్కవ మంది కోలుకుంటుండడం ఊరట కలిగిస్తోంది. ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో 53,370 కొత్త కేసులు నమోదుకాగా.. 67,549 మంది కోలుకొని ఇంటికి చేరుకున్నారు. గత కొన్ని రోజులుగా ఇదే ట్రెండ్‌ కొనసాగుతోంది. ఇక 61 శాతం రికవరీలు కేవలం ఆరు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా రికవరీ రేటు దాదాపు 90 శాతంగా ఉంది. మొత్తం రికవరీల్లో 20.6 శాతం మహారాష్ట్ర, 10.9 శాతం ఆంధ్రప్రదేశ్‌, 9.9 శాతం కర్ణాటక, 9.4 శాతం తమిళనాడు, 6.1 శాతం ఉత్తర్‌ప్రదేశ్‌, 4.1 శాతం దిల్లీ నుంచి నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

గత 24 గంటల్లో నమోదైన 53,370 కేసుల్లో 80 శాతం 10 రాష్ట్రాల నుంచే ఉన్నాయి. కేరళలో అత్యధికంగా 8,000 పైగా కేసులు వెలుగు చూస్తుండగా.. తర్వాత మహారాష్ట్రలో ఏడు వేల పైచిలుకు కేసులు నిర్ధారణ అవుతున్నాయి. కరోనా కేసులు వెలుగు చూసిన నాటి నుంచి దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 10,13,82,564 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీటిలో 12,69,479 నమూనాల్ని శుక్రవారం పరీక్షించారు.

ఇదీ చదవండి..
90 శాతానికి చేరవగా రికవరీ రేటు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని