Sonia Gandhi: పూర్తిగా కోలుకోలేదు.. మరింత సమయం ఇవ్వండి: సోనియా

నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్‌ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ ముందు హాజరుకావాల్సి ఉంది.

Published : 22 Jun 2022 18:12 IST

ఈడీకి లేఖ రాసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా

దిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్‌ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi) గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ED) ముందు హాజరుకావాల్సి ఉంది. అయితే అనారోగ్యం కారణంగా తన హాజరుకు కొన్ని వారాల పాటు మినహాయింపు ఇవ్వాలని ఆమె దర్యాప్తు సంస్థకు లేఖ రాశారు. ఈ మేరకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ వెల్లడించారు.

సోనియా గాంధీకి ఇటీవల కరోనా సోకిన విషయం తెలిసిందే. కరోనా తగ్గినప్పటికీ... కొవిడ్ అనంతర సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. వారం పైగా ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆమె రెండు రోజుల క్రితమే డిశ్ఛార్జి అయ్యారు. ‘‘కొవిడ్, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో చికిత్స తీసుకున్న సోనియాను ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దాంతో ఈడీ ముందు హాజరుకు మరికొంత గడువు ఇవ్వాలని దర్యాప్తు సంస్థకు సోనియా లేఖ రాశారు’’ అని జైరాం రమేశ్ వెల్లడించారు. మరోపక్క రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఐదు రోజులపాటు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఆయన్ను ఈడీ దాదాపు 50 గంటల పాటు ప్రశ్నించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని