Delhi: దిల్లీ-ఎన్‌సీఆర్‌లో 40శాతం కేసులు ‘లెక్కలోకి రానివే’..!

దేశ రాజధాని దిల్లీలో ఇటీవల కరోనా ఉద్ధృతి మళ్లీ ఎక్కువవుతోంది. గత కొద్ది రోజులుగా రోజువారీ కేసులు, పాజిటివిటీ రేటు పెరుగుతున్నాయి. అయితే వాస్తవానికి అధికారిక

Published : 03 May 2022 18:11 IST

సర్వేలో వెల్లడి

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో ఇటీవల కరోనా ఉద్ధృతి మళ్లీ ఎక్కువవుతోంది. గత కొద్ది రోజులుగా రోజువారీ కేసులు, పాజిటివిటీ రేటు పెరుగుతున్నాయి. అయితే వాస్తవానికి అధికారిక గణాంకాల కంటే ఎక్కువ కేసులే నమోదవుతున్నట్లు తాజాగా ఓ సర్వే వెల్లడించింది. ఏప్రిల్‌లో దాదాపు 40శాతం పాజిటివ్‌ కేసులు లెక్కలోకి రాలేదని తెలిపింది. వీరంతా ఇళ్లలో సెల్ఫ్‌ టెస్టులు చేసుకున్నట్లు పేర్కొంది.

దిల్లీ - ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో లోకల్‌ సర్కిల్స్‌ అనే సంస్థ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. ఏప్రిల్‌లో ఎంత మందికి కరోనా లక్షణాలు కన్పించాయి? ఎంతమంది పరీక్షలు చేయించుకున్నారా? ఎలాంటి పరీక్షలు చేయించుకున్నారా? ఇలా పలు ప్రశ్నలతో ఈ సర్వే చేపట్టింది. ఇందులో మొత్తంగా 16వేల మంది నుంచి స్పందనలు రాగా.. 7,248 మంది తమకు పాజిటివ్‌గా తేలినట్లు పేర్కొన్నారు. అయితే ఇందులో దాదాపు సగం మంది ఇంట్లోనే పరీక్షలు చేసుకున్నారట.

పాజిటివ్‌ వచ్చిన వారిలో 42శాతం మంది తాము ఇంట్లోనే సెల్ఫ్‌ ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు చేసుకున్నామని, పాజిటివ్‌ వచ్చినట్టు ప్రభుత్వానికి నివేదించలేదని పేర్కొన్నారని సర్వే వెల్లడించింది. దీంతో ప్రభుత్వ అధికారిక లెక్కల్లో ఈ కేసులు నమోదు కాలేదని తెలిపింది. ఒకవేళ ఈ కేసులను కూడా కలిపితే దిల్లీలో కరోనా కేసులు మరింత పెరిగేవని పేర్కొంది. అయితే దిల్లీతో పాటు, చాలా ప్రాంతాల్లో ఈ సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. స్వల్ప లక్షణాలున్న చాలా మంది ఇంట్లో పరీక్షలు చేసుకుని స్వీయ నిర్బంధంలో ఉండటంతో అవన్నీ అధికారిక లెక్కల్లోకి రావట్లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని