Haiti: పెట్రోల్​ ట్యాంకర్ పేలి 50 మంది సజీవ దహనం

కరీబియన్‌ ద్వీప దేశం హైతీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కేప్​-హైతియన్​లో​ పెట్రోల్​ తీసుకెళుతున్న ఓ ట్యాంకర్ పేలి 50మంది దుర్మరణం పాలయ్యారు......

Published : 14 Dec 2021 19:02 IST

పోర్టౌ ప్రిన్స్‌: కరీబియన్‌ ద్వీప దేశం హైతీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కేప్​-హైతియన్​లో​ పెట్రోల్​ తీసుకెళ్తున్న ఓ ట్యాంకర్ పేలి 50మంది దుర్మరణం పాలయ్యారు. అనేక మంది గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక డిప్యూటీ మేయర్‌ పాట్రిక్ అల్మోనోర్ వెల్లడించారు. ‘సంఘటనా స్థలంలో 50-54 మంది సజీవ దహనాన్ని చూశాను’ అని పాట్రిక్ అల్మోనోర్ పేర్కొన్నారు. పేలుడు కారణంగా సంభవించిన మంటలు అంటుకొని దాదాపు 20 ఇళ్లు కూడా కాలిపోయినట్లు తెలిపారు. మృతుల సంఖ్యను ఇప్పుడే చెప్పలేమన్నారు. కాగా ఈ ఘటనపై ఆ దేశ ప్రధాని ఏరియల్​ హెన్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే ఇళ్లల్లో చిక్కుకుపోయి మరణించినవారితో కలిపి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని