Israel PM to Modi: మోదీజీ.. ఇజ్రాయెల్‌లో మీరే మోస్ట్ పాపులర్..!
‘ఇజ్రాయెల్‌లో అత్యంత పాపులర్ వ్యక్తి మీరే.. వచ్చి మా పార్టీలో చేరండి’ అంటూ ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ నరేంద్ర మోదీతో సరదాగా వ్యాఖ్యానించారు.
వచ్చి మా పార్టీలో చేరండంటూ ఇజ్రాయెల్ ప్రధాని సరదా వ్యాఖ్య
గ్లాస్గో: స్కాట్లాండ్లో జరుగుతున్న కాప్-26 ఐరాస వాతావరణ సదస్సులో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పలువురు దేశాధినేతలు, వివిధ రంగాల అధిపతులతో భేటీ అయ్యారు. ఇందులో భాగంగా ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్‌తోనూ మోదీ సమావేశమయ్యారు. ఆ సందర్భంలో ఇరు దేశాల ప్రధానుల మధ్య సరదా సంభాషణ చోటుచేసుకుంది. ‘ఇజ్రాయెల్‌లో అత్యంత పాపులర్ వ్యక్తి మీరే.. వచ్చి మా పార్టీలో చేరండి’ అంటూ ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ సరదాగా వ్యాఖ్యానించారు. దీనికి మోదీ గట్టిగా నవ్వుతూ అభినందనలను స్వీకరించారు.
ఇక ఇజ్రాయెల్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నరేంద్ర మోదీతో బెన్నెట్ భేటీ కావడం ఇదే తొలిసారి. ఈ భేటీలో భాగంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఇద్దరు ప్రధానులు చర్చించారు. ముఖ్యంగా అత్యాధునిక సాంకేతికత, ఆవిష్కరణలు, వ్యవసాయం, అంతరిక్షం, భద్రత విషయాలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించినట్లు భారత విదేశాంగశాఖ వెల్లడించింది. ఇండో-ఇజ్రాయెల్ సంబంధాలను పునఃప్రారంభించడం పట్ల ఇజ్రాయెల్ ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపినట్లు పేర్కొంది. ఇజ్రాయెల్‌తో ఇంతకుముందు కొనసాగించినట్లుగానే భారత్ తన సహకారాన్ని అందించాలని ఆకాంక్షించిన బెన్నెట్.. వివిధ రంగాల్లో ఇరు దేశాలు కలిసి పనిచేస్తూ ముందుకు సాగాలని కోరారు.
బిల్‌గేట్స్‌తో మోదీ భేటీ
కాప్-26 సదస్సు జరుగుతున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. వాతావరణ మార్పులను తగ్గించడంలో కృషి చేయడంతోపాటు సుస్థిరాభివృద్ధి లక్ష్య సాధనకు తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు చర్చించినట్లు భారత ప్రధాని కార్యాలయం (పీఎంవో) వెల్లడించింది. ఇక సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా గేట్స్ ఫౌండేషన్ ద్వారా భారత్‌కు అవసరమైన సహకారం అందిస్తామని బిల్‌గేట్స్ ఇదివరకే స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఆరోగ్యం, పోషకాహారం, పారిశుద్ధ్యం, వ్యవసాయం విభాగాల్లో మరింత వృద్ధి సాధించేందుకు భారత్ చేసే ప్రయత్నాలకు మద్దతు ఇచ్చేందుకు గేట్స్ ఫౌండేషన్ కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. ఇక దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోన్న సమయంలో బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Sadananda: కాంగ్రెస్‌లోకి సదానంద గౌడ..? మనసులో మాట చెబుతానన్న మాజీ సీఎం
తన భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానని భాజపా సీనియర్ నేత సదానంద గౌడ(Sadananda) అన్నారు. -
Sanjay Singh: ‘ప్రమాణ స్వీకారానికి జైలు నుంచి పార్లమెంటుకు తీసుకెళ్లండి’ - దిల్లీ కోర్టు
రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సంజయ్ సింగ్ ప్రమాణస్వీకారం కోసం మార్చి 19న తిహాడ్ జైలు నుంచి పార్లమెంటుకు తీసుకెళ్లాలని దిల్లీ కోర్టు ఆదేశించింది. -
సంక్షోభం వేళ నీటి ఆదాకు బెంగళూరు డాక్టర్ ‘4 టిప్స్’.. రోజుకు 600 లీటర్లు సేవ్ చేశారట..!
Bengaluru Water Crisis: బెంగళూరుకు చెందిన ఓ డాక్టర్ కొన్ని టిప్స్‌తో రోజుకు 600 లీటర్లు నీటిని ఆదా చేశారట. వాటిని ఆమె వివరించగా.. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఆ టిప్స్ ఏంటో మీరే చూడండి..! -
Himachal Pradesh: కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై స్టేకు సుప్రీం నిరాకరణ
రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ విప్ ధిక్కరించి క్రాస్ ఓటింగ్‌కి పాల్పడిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల అనర్హతపై స్టే విధించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. -
Google: చిన్నప్పటి ఫొటోతో గూగుల్ అకౌంట్ బ్లాక్.. హైకోర్టు నోటీసులు
Google account: చిన్నప్పటి ఫొటోను అప్లోడ్ చేసిన కారణంగా గూగుల్ ఓ వ్యక్తి అకౌంట్‌ను బ్లాక్ చేసింది. దీనిపై అతడు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు. -
ECI: బెంగాల్ డీజీపీ సహా 6 రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులపై ‘ఈసీ’ వేటు
ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ల హోంశాఖ కార్యదర్శులను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. -
‘నేను సోనియాగాంధీతో భేటీ కాలేదు.. అది రాహుల్ పొలిటికల్ స్టంట్’: అశోక్ చవాన్
ఇటీవల కాంగ్రెస్(Congress)ను వీడిన సీనియర్ నేతలను ఉద్దేశించి ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం అశోక్ చవాన్ స్పందించారు. -
Satyendar Jain: ఆప్‌నేత సత్యేందర్ జైన్‌కు సుప్రీంలో చుక్కెదురు
మనీలాండరింగ్ కేసులో ఆప్ నేత సత్యేందర్ జైన్ బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టేసింది. -
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ వద్దే చోరీ.. తర్వాత సీన్ రివర్స్!
ఒంటరిగా ఉన్న వ్యక్తిని అదును చూసి ఇద్దరు దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కావడంతో వారి సీన్ రివర్స్ అయింది. -
Electoral Bonds: ఎన్నికల బాండ్ల నంబర్లూ చెప్పాల్సిందే.. ఎస్బీఐకి సుప్రీం డెడ్‌లైన్
Electoral Bonds: ఎన్నికల బాండ్ల నంబర్లను ఈసీకి ఇవ్వకపోవడంతో ఎస్బీఐపై సుప్రీంకోర్టు మరోసారి మండిపడింది. మార్చి 21లోగా అన్ని వివరాలు ఇవ్వాల్సిందేనని డెడ్‌లైన్ విధించింది. -
Electoral Bonds: నా విరాళాలు వారికిచ్చాను.. ఎన్నికల బాండ్లపై కిరణ్ మజుందార్ షా
Electoral Bonds: వ్యక్తిగత హోదాలో ఎన్నికల బాండ్ల ద్వారా తాను కొన్ని పార్టీలకు నామమాత్రపు విరాళాలిచ్చినట్లు బయోకాన్ ఛైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా వెల్లడించారు. -
S Jaishankar: ‘స్నేహమంటే అదే కదా’: నేవీ ఆపరేషన్‌పై జై శంకర్ ఆసక్తికర రిప్లై
హైజాక్ అయిన నౌక నుంచి 17 మంది బందీలను మన నౌకాదళం విడిపించింది. ఇందుకు బల్గేరియా దేశం ధన్యవాదాలు తెలిపింది. -
Arvind Kejriwal: దిల్లీ జల్‌బోర్డు కేసులోనూ.. ఈడీ సమన్లకు కేజ్రీవాల్ డుమ్మా
Arvind Kejriwal: దిల్లీ జల్‌బోర్డుకు సంబంధించిన కేసులోనూ ఈడీ విచారణకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ డుమ్మా కొట్టారు.ఆ సమన్లు అక్రమమని ఆరోపించారు. -
Russia: మమ్మల్ని విడిపించండి ప్లీజ్: రష్యా నుంచి భారతీయుల మరో వీడియో
Indians Stuck In Russia: రష్యా సైన్యంలో చిక్కుకుపోయిన భారతీయులు తమను కాపాడాలంటూ మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. -
Rahul Gandhi: ‘ఆయన మా అమ్మకు ఫోన్ చేసి కన్నీటిపర్యంతమయ్యారు’: రాహుల్ గాంధీ వ్యాఖ్యలు
ఇటీవల కాంగ్రెస్(Congress)ను వీడిన సీనియర్ నేతలను ఉద్దేశించి.. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఎన్డీయే కూటమిపై విమర్శలు చేశారు. -
వారికి అమెరికా పౌరసత్వం ఇస్తుందా?: హరీశ్ సాల్వే
భారత్ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు చేయడంపై ఇటీవల అమెరికా ఆందోళన వ్యక్తం చేయడాన్ని సీనియర్ న్యాయవాది, మాజీ సోలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే తప్పుపట్టారు. ప్ -
కోడ్ మీరితే కొరడా!
భారతదేశంలో ఎన్నికలు ఓ మహాసంగ్రామం! గెలుపే లక్ష్యంగా పార్టీలు ఎత్తుగడలు, వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తుంటాయి. -
బెట్టింగ్ యాప్ కుంభకోణం.. భూపేశ్ బఘేల్‌పై కేసు
మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌పై రాష్ట్ర ఆర్థికనేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) కేసు నమోదు చేసింది. -
ఆ రూ.4 వేల కోట్ల వివరాలూ వెల్లడించాలి
ఎన్నికల బాండ్లపై మరో పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలైంది. 2018 మార్చి 1 నుంచి 2019 ఏప్రిల్ 11 వరకు అమ్మిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వెల్లడించాలంటూ అందులో పిటిషనర్ సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. -
సీఏఏ నిబంధనల అమలుపై స్టే ఇవ్వండి
పౌరసత్వ (సవరణ) నిబంధనలు-2024 అమలుపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టులో కేరళ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. -
మగబిడ్డకు జన్మనిచ్చిన మూసేవాలా తల్లి
దివంగత పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా తల్లి చరణ్ కౌర్ మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సిద్ధూ తండ్రి బాల్కౌర్ సింగ్ సామాజిక మాధ్యమాల ద్వారా స్వయంగా వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
RS Praveen Kumar: భారాసలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
-
MLC Kavitha: ఆప్ నేతలతో కలిసి ఎమ్మెల్సీ కవిత అక్రమాలు.. ఈడీ ప్రకటన
-
Viral Video: సర్కస్‌లో స్టంట్.. పట్టుతప్పి 12 అడుగుల ఎత్తు నుంచి జారిపడిన యువతి
-
Mangli: నేను క్షేమంగానే ఉన్నా.. రూమర్స్ నమ్మకండి: సింగర్ మంగ్లీ
-
Sadananda: కాంగ్రెస్‌లోకి సదానంద గౌడ..? మనసులో మాట చెబుతానన్న మాజీ సీఎం
-
AP News: ‘ప్రజాగళం’ భద్రతా వైఫల్యంపై సీఈవోకి ఎన్డీయే నేతల ఫిర్యాదు