
PM's Chat With Bihar delegation: మాంఝీతో మోదీ చమత్కారం.. అంతా మీ వల్లేనన్న నితీశ్..!
దిల్లీ: కులాలవారీగా జనగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. బిహార్‌కు చెందిన నేతలు సోమవారం ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఈ సమయంలో ప్రధాని నేతల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. మరికొందరితో సరదాగా సంభాషించారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ మాత్రం ‘మోదీజీ.. అంతా మీ వల్లే’ అంటూ ట్విస్ట్ ఇచ్చారు.
బిహార్ నేతలతో సమావేశంలో భాగంగా ఆర్జేడీ అగ్రనేత లాలూ ప్రసాద్ యాదవ్ గురించి మోదీ ఆరా తీశారు. ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌తో మాట్లాడుతూ..‘లాలూజీ..ఎలా ఉన్నారు?’ అంటూ ప్రశ్నించారు. ఇంకా లాలూ గురించి పలు విషయాలు అడిగితెలుసుకున్నారు. ప్రధాని చూపిన శ్రద్ధపై సభ్యులు ఆశ్చర్యపోయారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
అలాగే బిహార్ మాజీ ముఖ్యమంత్రి జీతన్ రాం మాంఝీతో ప్రధాని చమత్కరించారు. ‘మాంఝీ.. మీరు మొహాన్ని మాస్క్‌తో కప్పేస్తే, మీ చిరునవ్వులు మాకెలా కనిపిస్తాయి?’ అని సరదాగా మాట్లాడారు. అక్కడే ఉన్న నితీశ్ స్పందిస్తూ.. ‘బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్క్ ధరించాలని మీరేగా చెప్పారు’ అంటూ అంతే సరదాగా బదులిచ్చారు.
కులగణనపై ఈ రోజు జరిగిన సమావేశంలో బిహార్ నేతలు తమ డిమాండ్‌ను ప్రధాని ముందు ఉంచారు. త్వరలో కేంద్రం తగిన నిర్ణయం తీసుకుంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.