Lakhimpur Kheri: లఖింపుర్‌లో సంస్మరణ సభ.. అన్నదాతలకు నివాళి

ఉత్తర్‌ప్రదేశ్‌ లఖింపుర్‌ ఖేరి ఘటనలో మృతిచెందిన అన్నదాతలకు నివాళులు అర్పించేందుకు రైతు సంఘాలు నేడు సంస్మరణ సభ నిర్వహించాయి.

Published : 12 Oct 2021 23:56 IST

పాల్గొన్న కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీ

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ లఖింపుర్‌ ఖేరి ఘటనలో మృతిచెందిన అన్నదాతలకు నివాళులు అర్పించేందుకు రైతు సంఘాలు నేడు సంస్మరణ సభ నిర్వహించాయి. ఇందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో రైతులు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా కూడా హాజరయ్యారు. చనిపోయిన అన్నదాతలకు నివాళులు అర్పించారు. అయితే, రైతులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రాజకీయ పార్టీలు దూరంగా ఉండాలని రైతు సంఘాల నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమ వేదికపై కేవలం అన్నదాతలు మాత్రమే ఉంటారని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ టికాయిత్‌ స్పష్టం చేశారు.

ఇక లఖింపుర్‌ ఖేరిలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనకు నిరసనగా సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో నేడు దేశవ్యాప్తంగా షహీద్‌ కిసాన్‌ దివస్‌ నిర్వహిస్తున్నారు. ఆ ఘటనలో మృతి చెందిన నలుగురు రైతులతో పాటు ఓ జర్నలిస్టుకు స్మృతిగా ఈ రాత్రి 8 గంటలకు ప్రతి ఇంటి ముందు 5 కొవ్వొత్తులు వెలిగించాలని సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రజలకు పిలుపు నిచ్చింది.

లఖీంపుర్‌ ఖేరి ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రాను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. తొలుత ఆయనను దాదాపు 12గంటల పాటు విచారించినప్పటికీ సరైన సమాధానాలు ఇవ్వలేదని పోలీసులు పేర్కొన్నారు. దీంతో మరోసారి విచారించేందుకు పోలీసులు అనుమతి కోరగా.. అక్టోబర్‌ 15వరకు పోలీసు కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. ప్రస్తుతం ఆశిష్‌ మిశ్రా పోలీసు కస్టడీలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు