UN Security Council: ఐరాస.. అప్పుడలా.. ఇప్పుడిలా!

 ఐరాస భద్రతా మండలి ఉగ్రవాదం విడుదల చేసిన ఒక ప్రకటన నుంచి తాలిబన్‌ పేరును తప్పించారు.

Published : 30 Aug 2021 01:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌:  ఉగ్రవాదంపై ఐరాస భద్రతా మండలి  విడుదల చేసిన ఒక ప్రకటన నుంచి తాలిబన్‌ పేరును తప్పించారు. ఈ ప్రకటన ఆగస్టు 27వ తేదీన వెలువడింది. కాబుల్‌ విమానాశ్రయంపై దాడిని ఖండిస్తు ఈ ప్రకటన విడుదల చేశారు. తాజాగా ఆగస్టు నెలకు భద్రతా మండలి అధ్యక్ష బాధ్యతలను భారత్‌ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో అధ్యక్ష హోదాలో భారత్‌ దానిపై సంతకం చేసింది.   అంతకుముందు తాలిబన్లు కాబుల్‌ను ఆక్రమించిన రెండోరోజే ఆగస్టు 16వ తేదీన ఐరాస ఇటువంటి ప్రకటనే విడుదల చేసింది. దానిలో ‘తాలిబన్‌, ఇతర అఫ్గాన్‌ గ్రూపులు  లేదా వ్యక్తులు ’అని స్పష్టంగా ఉంది. ఈ రెండు ప్రకటనల్లో మార్పును ఐరాసలో భారత రాయబారిగా గతంలో పనిచేసిన సయ్యద్‌ అక్బరుద్దీన్‌ వెలుగులోకి తెచ్చారు. ‘‘దౌత్యంలో రెండు వారాలనేది చాలా ఎక్కువ సమయం. ‘టి’వర్డ్‌ మాయమైపోయింది. ఆగస్టు 16,27వ తేదీల్లో విడుదలైన ఐరాస ప్రకటనల్లో నేను మార్క్‌ చేసిన చోట చూడండి’’ అని ఆయన ట్వీట్‌ చేశారు. రెండు స్టెట్‌మెంట్లను ట్వీట్‌కు జత చేశారు. ప్రస్తుతం అక్బరుద్దీన్‌ ‘కౌటీల్యా స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ’ డీన్‌గా పనిచేస్తున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని