Aadhaar Number: సర్టిఫికెట్లపై ఆధార్‌ నంబర్‌ వద్దు.. వర్సిటీలకు UGC లేఖ

Aadhaar Number: డిగ్రీ, ప్రొవిజినల్‌ సర్టిఫికెట్లపై పూర్తి ఆధార్‌ నంబర్‌ ముద్రించరాదని వర్సిటీలకు యూజీసీ సూచించింది.

Updated : 02 Sep 2023 17:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యూనివర్సిటీ గ్రాంట్స్  కమిషన్‌-UGC కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీలు, ప్రొవిజినల్‌ సర్టిఫికెట్లపై పూర్తి ఆధార్‌ నంబర్‌ ముద్రించ వద్దని వర్సిటీలకు సూచించింది. వ్యక్తిగత వివరాలు బయటకు వెళ్లే అవకాశముందన్న ఆందోళనలను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వర్సిటీలకు రాసిన లేఖలో పేర్కొంది.

కోటక్‌ బ్యాంక్‌ సీఈఓ పదవికి ఉదయ్‌ కోటక్‌ రాజీనామా.. 4 నెలల ముందే!

‘ఉడాయ్‌ నిబంధనల ప్రకారం.. ఆధార్ నంబర్‌ను కలిగి ఉన్న ఏ సంస్థ కూడా వ్యక్తి పూర్తి ఆధార్‌ నంబర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపెట్టరాదు. డిగ్రీలు, ప్రొవిజన్‌ సర్టిఫికెట్లపై ఆధార్‌ నంబర్‌ ముద్రించటాన్ని అనుమతించం. భారత విశిష్ట ప్రాధికార సంస్థ (UIDAI) నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలి’ అని యూజీసీ సెక్రెటరీ మనీష్‌ జోషి వర్సిటీలకు రాసిన లేఖలో తెలిపారు. డిగ్రీ మార్కుల మెమోలపై పూర్తి ఆధార్ నంబర్‌ ముద్రిస్తే అడ్మిషన్‌  వెరిఫికేషన్‌ సమయంలో సాయపడుతుందని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఈ సమయంలో UGC ఈ ఆదేశాలను జారీ చేయటం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని