
Maoist attack: మావోయిస్టుల దుశ్చర్య.. ఐఈడీ పేలి 12 మందికి తీవ్రగాయాలు
దంతెవాడ: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ సమీపంలోని ఘటియా మావోయిస్టుల అమర్చిన ఐఈడీ బాంబులు పేలాయి. పేలుడు ధాటికి అదే మార్గంలో వెళ్తున్న బొలేరో వాహనం ధ్వంసమైంది. అందులో ఉన్న 12 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలానికి భద్రతా బలగాలు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించాయి. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.