
Omicron: ‘సోట్రోవిమాబ్’కు బ్రిటన్ ఆమోదం.. ఒమిక్రాన్‌పై పనిచేస్తుందన్న సంస్థ
లండన్: కొవిడ్ లక్షణాలు తీవ్రమయ్యే ప్రమాదం ఉన్న బాధితుల చికిత్స కోసం గ్లాక్సోస్మిత్‌క్లైన్(జీఎస్కే) ఉత్పత్తి చేసిన ‘సోట్రోవిమాబ్’ను బ్రిటన్ గురువారం ఆమోదించింది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్పైకూడ ఇది ప్రభావవంతంగా పనిచేస్తుందని ఆ సంస్థ వెల్లడించింది. ఈ మోనోక్లోనల్ యాంటీబాడీ డ్రగ్ ఒక డోసు..కరోనా బాధితులు ఆసుపత్రిలో చేరడం, మరణించే ప్రమాదాన్ని 79 శాతం తగ్గించినట్లు తేలిందని బ్రిటన్ మెడికల్ రెగ్యులేటరీ మెడిసిన్స్, హెల్త్‌కేర్ ప్రోడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ(ఎంహెచ్ఆర్ఏ) తెలిపింది.
ఇతర కణాల్లోకి చేరకుండ అడ్డగింత..
ఈ రోజు వరకు డబ్ల్యూహెచ్‌వో గుర్తించిన అన్ని వేరియంట్లపై సోట్రోవిమాబ్ ప్రభావం చూపినట్లు జీఎస్కే పేర్కొంది. ఒమిక్రాన్ కీలక మ్యుటేషన్లకూ వ్యతిరేకంగా పనిచేసినట్లు ప్రీ క్లినికల్ డేటాలో వెల్లడైందని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విషయమై పూర్తిస్థాయి నిర్ధారణకుగానూ పరీక్షలు చేపడుతున్నామని, ఈ ఏడాది చివరి నాటికి ఫలితాలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. మోనోక్లోనల్ యాంటీబాడీస్.. కరోనా వైరస్‌లోని స్పైక్ ప్రోటీన్‌ను శరీరంలోని ఇతర కణాల్లోకి చేరకుండా అడ్డుకుంటాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.