India to UK: లండన్‌ వెళ్లాలనుకునే వారికి కాస్త ఊరట..కానీ..!

భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులకు బ్రిటన్‌ ప్రభుత్వం పలు ఆంక్షలను సడలించింది. తమ దేశానికి వచ్చే భారతీయలు ఇకపై ఖరీధైన పీసీఆర్‌ టెస్టులను

Published : 15 Sep 2021 20:40 IST

లండన్‌: భారత్‌ నుంచి వచ్చే ప్రయాణీకులకు బ్రిటన్‌ ప్రభుత్వం పలు ఆంక్షలను సడలించింది. తమ దేశానికి వచ్చే భారతీయలు ఇకపై ఖరీధైన పీసీఆర్‌ టెస్టులను చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధనలు అక్టోబరు 1నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. అంతర్జాతీయ ప్రయాణీకుల కోసం ఏర్పాటు చేసిన రెడ్-అంబర్-గ్రీన్ జోన్లలో భారత్‌ను అంబర్‌ కేటగిరీ నుంచి యూకే తొలగించింది. కానీ, భారత్‌లో రెండు డోసుల టీకాలు తీసుకుని వెళ్లే ప్రయాణికులను యూకే గుర్తిస్తుందా?అనే దానిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటి వరకూ సీరం ఇన్‌స్టిట్యూట్‌ తయారు చేసిన ఆస్ట్రాజెనెకా, కొవిషీల్డ్‌ రెండు డోసులు తీసుకున్న వారిని యూకే గుర్తించలేదు. ప్రస్తుత నిబంధనల ప్రకారం యూకే, యూఎస్‌లో వ్యాక్సిన్‌ తీసుకొన్న వారిని సైతం క్వారంటైన్‌లో ఉండాలని సూచించింది. అంతేకాకుండా ఆ దేశానికి వచ్చిన 2వ రోజు, 8వ రోజు ఆర్టీ పీసీఆర్‌ పరీక్ష చేయించుకోవాలని నిబంధనలు పెట్టింది.

అక్టోబర్ 1 నుంచి వర్తించే కొత్త నియమాలివే..

భారతదేశంలో విమానం ఎక్కడానికి మూడు రోజుల ముందు కొవిడ్ పరీక్ష చేయించుకోవాలి.

లండన్‌కు వచ్చాక 2వ, 8వ రోజు పీసీఆర్‌ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. భారత్‌ నుంచి బయలుదేరే ముందే వీటిని బుక్ చేసుకోవాలి.

భారత్‌లో పూర్తిగా టీకాలు తీసుకున్నా 10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి. 18 ఏళ్లలోపు వారికి ఈ నియమం వర్తించదు.

11 ఏళ్లలోపు వారు ప్రయాణానికి ముందు పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. కానీ, 2వ రోజు పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. స్కాట్లాండ్‌ నుంచి వచ్చే 12 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలూ 2వ రోజు టెస్టు చేయించుకోవాలి.

5 ఏళ్ల లోపు పిల్లలకు ఎటువంటి పరీక్షలు చేయించాల్సిన అవసరం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని