హెలికాఫ్టర్ దిగుతుంటే వచ్చిన గాలికి.. కళాశాల గోడ కూలింది..!

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా యూపీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ పార్టీకి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది.

Published : 23 Feb 2022 23:14 IST

నడ్డా పర్యటనలో ఇబ్బందికర పరిస్థితి

బలియా: భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా యూపీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఊహించని పరిణామం సంభవించింది. ప్రచారంలో భాగంగా నడ్డా ప్రయాణిస్తోన్న హెలికాప్టర్‌ ఓ  పాఠశాల ప్రాంగణంలో దిగింది. అది దిగే క్రమంలో అక్కడ గాలులు బలంగా వీచాయి. ఆ సమయంలో దుమ్ము, ధూళి లేవడం సాధారణమే కానీ.. ఆ గాలులకు కళాశాల గోడ కూలడమే ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. ఆ హెలికాఫ్టర్ దిగుతుండగా.. ప్రహరీ కూలిపోయింది. అయితే ఆ ఘటనలో ఎవరూ గాయపడలేదు. 

దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అవి చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. యూపీలో విద్యా సదుపాయాల నాణ్యతను ప్రశ్నిస్తున్నారు.  ప్రస్తుతం యూపీలో నాలుగో విడత పోలింగ్ జరుగుతోంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని