Lockdown in Kerala: కేరళలో సంపూర్ణ లాక్‌డౌన్

కేరళలో కరోనా వైరస్ ఆందోళనకర స్థాయిలో విజృంభిస్తోంది. అక్కడ 20వేలపైన కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ వైరస్ వ్యాప్తిని కట్టడికి చేసేందుకు అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్ ఆంక్షలవైపు మొగ్గుచూపింది. వారాంతంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్లు ప్రకటించింది. జులై 31, ఆగస్టు 1న ఈ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.

Updated : 29 Jul 2021 12:44 IST

ఆ రాష్ట్రానికి వైద్య బృందాన్ని పంపుతున్న కేంద్రం

తిరువనంతపురం: కేరళలో కరోనా వైరస్ ఆందోళనకర స్థాయిలో విజృంభిస్తోంది. అక్కడ 20వేలపైన కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ వైరస్ వ్యాప్తిని కట్టడికి చేసేందుకు అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్ ఆంక్షలవైపు మొగ్గుచూపింది. వారాంతంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్లు ప్రకటించింది. జులై 31, ఆగస్టు 1న ఈ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.

ఇదిలాఉండగా..ఈ కొవిడ్ పరిస్థితులను పర్యవేక్షించేందుకు నేషనల్‌ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌కు చెందిన ఆరుగురు సభ్యుల బృందాన్ని కేంద్రం కేరళకు పంపనుంది. ‘కేరళలో భారీగా కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. వైరస్‌పై అక్కడి ప్రభుత్వం జరుపుతున్న పోరులో ఈ బృందం సహకరించనుంది’ అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. 

రెండోదశలో ఉగ్రరూపం దాల్చిన కరోనా.. మే చివరి నుంచి అదుపులోకి రావడం ప్రారంభించింది. మిగతా రాష్ట్రాల్లో రోజువారీగా వందల సంఖ్యలో కొవిడ్ కేసులు నమోదవుతుంటే కేరళలో మాత్రం నిత్యం 10వేలకు పైగా బయటపడుతున్నాయి. ఆ సంఖ్య ఇప్పుడు 20వేల మార్కును దాటింది. రోజువారీ కేసుల్లో దాదాపు సగం కేసులు ఒక్క కేరళలోనే రావడం ప్రభుత్వాలను కలవరపెడుతోంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని