Nagaland: అసలు కేంద్ర హోం శాఖ ఏం చేస్తున్నట్లు?: రాహుల్‌ గాంధీ

నాగాలాండ్‌లోని మోన్‌ జిల్లాలో శనివారం సాయంత్రం భద్రతాబలగాలు మిలిటెంట్లుగా భావించి పౌరులపై కాల్పులు జరిపిన ఘటనలో.. 13 మంది మృతి చెందగా, మరో 11 మందికి తీవ్ర గాయాలయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ విచారం...

Published : 05 Dec 2021 15:26 IST

దిల్లీ: నాగాలాండ్‌లోని మోన్‌ జిల్లాలో శనివారం సాయంత్రం భద్రతాబలగాలు మిలిటెంట్లుగా భావించి పౌరులపై కాల్పులు జరిపిన ఘటనలో.. 13 మంది మృతి చెందగా, మరో 11 మందికి తీవ్ర గాయాలయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ విచారం వ్యక్తం చేస్తూ.. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. హోం మంత్రిత్వ శాఖ ఏం చేస్తోందంటూ ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. ‘ఇది హృదయ విదారకం. దీనిపై కేంద్ర ప్రభుత్వం నిజమైన సమాధానం ఇవ్వాలి. స్వదేశంలోనే పౌరులు, భద్రతా సిబ్బంది సురక్షితంగా లేనప్పుడు అసలు హోం మంత్రిత్వ శాఖ ఏం చేస్తున్నట్లు’ అంటూ ప్రశ్నించారు.

ఈ ఘటనపై నాగాలాండ్‌ ముఖ్యమంత్రి నెయ్‌ప్యూ రియో ఇప్పటికే అత్యున్నత స్థాయి సిట్‌ దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఆర్మీ 3 కోర్‌ సైతం దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. పౌరుల ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. ఈ ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులను చట్ట ప్రకారం శిక్షిస్తామని పేర్కొంది. ఈ ఘటన అనంతర పరిణామాల్లో ఒక జవాను సైతం మృతి చెందినట్లు తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని