Indian idol 12: ఇండియన్ ఐడల్ 12 విజేతగా పవన్‌దీప్ రాజన్
సంగీత ప్రియుల్ని అలరించే పాపులర్ మ్యూజికల్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ సీజన్ 12 విజేతగా పవన్‌దీప్ రాజన్ నిలిచారు. తొలి రన్నరప్‌గా అరుణిత కంజిలాల్, మూడో స్థానంలో సేలీ కంబ్లే, నాలుగో స్థానంలో మహ్మద్ దనిష్, ఐదో
ఇంటర్నెట్‌డెస్క్: సంగీత ప్రియుల్ని అలరించే పాపులర్ మ్యూజికల్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ సీజన్ 12 విజేతగా పవన్‌దీప్ రాజన్ నిలిచారు. తొలి రన్నరప్‌గా అరుణిత కంజిలాల్, మూడో స్థానంలో సేలీ కంబ్లే, నాలుగో స్థానంలో మహ్మద్ దనిష్, ఐదో స్థానంలో నిహల్, మన తెలుగు అమ్మాయి షణ్ముఖ ప్రియ ఆరో స్థానంలో నిలిచింది. ఎన్నో ఆశలతో ఫైనల్ పోరుకు చేరిన షణ్ముఖప్రియకు నిరాశే ఎదురైంది. తన అద్భుతగానంతో సంగీత ప్రపంచాన్ని మెప్పించిన ఫైనల్ విజేత పవన్‌దీప్ రాజన్‌కు రూ. 25 లక్షల చెక్‌ను అందజేశారు. 12 గంటల పాటు నిర్విరామంగా జరిగిన ఈ ఫైనల్ పోటీ ఆద్యంతం తీవ్ర ఉత్కంఠ రేపింది. గ్రాండ్ ఫినాలే ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమైన ఈ ఫైనల్ షో అర్ధరాత్రి వరకు సాగింది. ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా సంగీత అభిమానులు తిలకించి ఉర్రూతలూగారు. మొదటినుంచి అద్భుత గానంతో అలరించి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించి ఫైనల్ బరిలో మన తెలుగుతేజం షణ్ముఖ ప్రియతో సహా పవన్‌దీప్ రాజన్, అరుణిత కంజిలాల్, నిహల్, సేలీ కంబ్లే, మహ్మద్ దనిష్ నిలిచారు. ఈ ఫైనల్లో విజేతగా ఎవరు నిలుస్తారని అందరూ ఊపిరిబిగబట్టుకొని చూశారు. చివరగా ఫైనల్ విజేతగా పవన్‌దీప్‌ను ప్రకటించడంతో అంతటా హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి.
ఇండియన్ ఐడల్ 12 సీజన్‌కు ఆదిత్య నారాయణ్ హోస్ట్‌గా, హిమేశ్ రేష్మియా, అను మాలిక్, సోను కక్కర్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. గ్రాండ్ ఫినాలేకు జావెద్ అలీ, సుఖ్విందర్ సింగ్, రాఘవ్ సచార్, మికా సింగ్, సాధన సర్గమ్, అన్ను కపూర్, షేర్షా జంట సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అడ్వాణీ, ఉదిత్ నారాయణ్, అల్కా యజ్ఞిక్, వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్ ఫేం గ్రేట్ కాళీ తదితరులు అతిథులుగా విచ్చేశారు. పలువురు గాయకులు పాటలతో ఫైనల్‌పోరులో ఉత్సాహం నింపారు.
నమ్మలేక పోతున్నా.. పవన్‌దీప్
ఇండియన్ ఐడల్ 12 విజేతగా నిలిచిన అనంతరం పవన్‌దీప్ మాట్లాడుతూ ‘‘నేను టైటిల్ గెలిచానని నమ్మలేకపోతున్నాను. కలలో ఉన్నట్లు అనిపిస్తోంది. వాస్తవంలోకి రాలేకపోతున్నాను. ఇది నాకు లభించిన గొప్ప గౌరవం. నాకు ఓట్లేసి గెలిపించిన అభిమానులకు, ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు. ఇండియన్ ఐడల్ పోటీలో నాతోపాటు కలిసి ప్రయాణించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు. నన్ను విజేతగా తయారు చేసిన వారు, సంగీతకళాకారులు, నా గురువులు, సహ పోటీదారులందరిది ఈ ట్రోపీ. ఇండియన్ ఐడల్, దేశ ప్రజలకు ధన్యవాదాలు. విజేతగా నిలిచిన సందర్భం గొప్పగా ఉంది’’ అని పవన్ పేర్కొన్నాడు. పవన్‌దీప్ రాజన్‌ది ఉత్తరాఖండ్‌లోని చంపావత్ జిల్లా. ఇండియన్ ఐడల్ 12లో మొదటి నుంచి బలమైన పోటీదారుగా ఉన్నాడు. 2015 పవన్‌దీప్ వాయిస్ ఇండియా షోలో విజేతగా నిలిచాడు. 2020 నవంబర్ 28న ప్రారంభమైన ఈ షో 9 నెలల పాటు సంగీత ప్రియులను అలరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్‌కుమార్ ఫన్నీ వీడియో
పెళ్లిపై నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ ఓ వీడియో క్రియేట్ చేశారు. దాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. -
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’లపై ప్రశాంత్ నీల్ అప్డేట్ ఇచ్చారు. దీంతో సినీప్రియులు ఆనందిస్తున్నారు. -
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
తన పారితోషికం గురించి నటుడు ఫహద్ ఫాజిల్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. -
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన రణ్వీర్ సింగ్
రణ్వీర్ సింగ్ తన ఇన్‌స్టా నుంచి పెళ్లి ఫొటోలు తొలగించడం చర్చనీయాంశంగా మారింది. -
Arya: ‘అ అంటే అమలాపురం’.. 20 ఏళ్లయినా అదే గ్రేస్‌తో అదరగొట్టిన అభినయశ్రీ!
ప్రముఖ నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రంగా ‘ఆర్య’ నిలిచిపోతుంది. అప్పట్లో ఈ సినిమాలోని ‘‘అ అంటే అమలాపురం..’’ పాట యువతను ఉర్రూతలూగించింది. ఆ పాటలో అభినయశ్రీ తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. తాజాగా నిర్వహించిన వేడుకలో ఆమె మరోసారి అదే పాటకు స్టెప్పులేసి అలరించింది.
-
Allu Arjun: ‘ఆర్య’.. నా కెరీర్‌ని ట్రాక్‌లోకి తీసుకొచ్చింది: అల్లుఅర్జున్
తెలుగు చిత్ర పరిశ్రమకి ‘ఆర్య’ ఓ మలుపు అని ప్రముఖ నటుడు అల్లుఅర్జున్ (Allu Arjun) అన్నారు. ఆయన కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్య’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మించారు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి 20 ఏళ్లయింది. ఈ సందర్భంగా చిత్రబృందం మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఓ వేడుకని నిర్వహించింది.
-
ఓటీటీలో ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అదాశర్మ కీలక పాత్రలో నటించిన ‘బస్తర్’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమైంది. -
వి.వి. వినాయక్ వల్లే ‘ఆర్య’ సాధ్యమైంది: అల్లు అర్జున్
వి.వి వినాయక్ ఇచ్చిన ధైర్యం వల్లే ‘ఆర్య’ తీశామని అల్లు అర్జున్ అన్నారు. -
Pushpa: ‘పుష్ప’ ఫేమస్ డైలాగ్ వెనుక హరీశ్ శంకర్
Pushpa 2: The Rule: ‘పుష్ప’ ఫేమస్ డైలాగ్ వెనుక దర్శకుడు హరీశ్ శంకర్ ఉన్నారు. -
‘సలార్’లో పాత్రపై ఊహించని అప్డేట్ ఇచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్
‘సలార్’లో తన పాత్రపై పృథ్వీరాజ్ సుకుమారన్ అప్డేట్ ఇచ్చారు. దీంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. -
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. రిప్లై ఇచ్చిన ‘దేవర’ భామ
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్‌పెట్టారు. దానికి ఆమె రియాక్ట్ అయ్యారు. -
బాహుబలి విశ్వాన్ని మరింత విస్తరింపజేస్తాం
‘బాహుబలి’ సినిమాలతో సినీప్రియుల్ని అలరించారు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఇప్పుడీ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న యానిమేటెడ్ సిరీస్ ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’. దీనికి జీవన్ జె.కాంగ్, నవీన్ జాన్ దర్శకత్వం వహించారు. -
ఊరిస్తున్న ఎన్టీఆర్
‘దేవర’ ప్రచార చిత్రాలతో సినీ ప్రియుల్ని అలరించారు ఎన్టీఆర్. ‘వార్ 2’ కోసం హిందీలోకి అడుగుపెట్టి.... ఆ కొత్త ప్రయాణం గురించీ ఆసక్తిగా మాట్లాడుకునేలా చేశారు. ఆయన పుట్టినరోజు దగ్గర పడుతుండడంతో మరోసారి ‘దేవర’ ప్రచార చిత్రాలు కానీ, పాటతో కానీ హంగామా చేయొచ్చని పరిశ్రమ, అభిమాన వర్గాల అంచనా. -
తెలుగు చిత్ర పరిశ్రమకి ఓ మలుపు... ఆర్య
‘‘తెలుగు సినిమా ఇలా కూడా ఉంటుందా అనిపించేలా అప్పట్లో ‘ఆర్య’ తీశారు సుకుమార్. ఎంతో మంది దర్శకులు... ఎన్నో మంచి చిత్రాలు ఈ సినిమా నుంచే వచ్చాయి. తెలుగు చిత్ర పరిశ్రమకి ‘ఆర్య’ ఓ మలుపు’’ అన్నారు అల్లు అర్జున్. -
మెరుపుల తార.. తళుకుల చీర
అందం, నటనతో అలరిస్తున్న బాలీవుడ్ అగ్రనాయిక అలియా భట్ ఈసారి ఆకట్టుకునే వస్త్రధారణతో అంతర్జాతీయ యవనికపై అలరించింది. ప్రఖ్యాత ఫ్యాషన్ వేదిక ‘మెట్ గలా’లో ఆమె చీరలో మెరిసింది. -
రోడ్లన్నీ గతుకులపాలే.. ఊరంతా చీకటిపాలే
ఓట్లు కొనేసి ఆ తర్వాత ప్రజల బాగుని మరిచే రాజకీయ నాయకుల్ని నమ్మొద్దని... గొర్రెల్లా కాకుండా మనిషిలా ఆలోచించి ఓటు వేయండని పిలుపునిస్తూ ‘కమిటీ కుర్రోళ్ళు’ పాటందుకున్నారు. మరి వారి ఆట పాట జనాల్లో ఎలాంటి మార్పుని తీసుకొచ్చిందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
‘డియర్ స్టూడెంట్స్’ సందడి మొదలు
ఇటీవలే ‘డియర్ స్టూడెంట్స్’ అగ్రతార నయనతారకు స్వాగతం పలికారు. ఈమె, నివిన్ పౌలీ జంటగా నటిస్తున్న వినోదాత్మక చిత్రమిది. సందీప్ కుమార్, జార్జ్ ఫిలిప్రాయ్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. -
జులై 20న.. కౌలాలంపూర్‌లో
తెలుగు సినిమా వైభవాన్ని... వారసత్వ పరంపరని చాటి చెప్పేలా 90 ఏళ్ల వేడుకని నిర్వహిస్తామని చెప్పారు మా అధ్యక్షుడు మంచు విష్ణు. జులై 20న కౌలాలంపూర్, బుకిట్ జలీల్‌లోని ప్రతిష్ఠాత్మక నేషనల్ స్టేడియంలో ఈ వేడుకల్ని నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. -
తెరపై యుద్ధం.. ఖర్చు రూ.8కోట్లు
‘కార్తికేయ 2’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు నిఖిల్. ఇప్పుడు ‘స్వయంభూ’తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్నారు. -
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అప్డేట్స్ మీకోసం..
తాజా వార్తలు (Latest News)
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
చెలరేగిన హెడ్, అభిషేక్.. హైదరాబాద్ అద్భుత విజయం
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్‌కుమార్ ఫన్నీ వీడియో
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM