‘సీఈవోలుగా రోజా, మనో’: అదిరే అభి

గత కొన్నేళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోన్న ఖతర్నాక్‌ కామెడీ షో ‘జబర్దస్త్‌’. అనసూయ వ్యాఖ్యాతగా ప్రసారమవుతోన్న ఈ కామెడీ షో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. రోజా, మనో, అనసూయల కామెడీ టైమింగ్‌తో పాటు కమెడియన్లు వేసే వరుస పంచులతో ఈ షో ప్రతి ఒక్కర్నీ ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Published : 05 Dec 2020 21:41 IST

హైదరాబాద్‌: గత కొన్నేళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోన్న ఖతర్నాక్‌ కామెడీ షో ‘జబర్దస్త్‌’. అనసూయ వ్యాఖ్యాతగా ప్రసారమవుతోన్న ఈ కామెడీ షో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. రోజా, మనో, అనసూయల కామెడీ టైమింగ్‌తో పాటు కమెడియన్లు వేసే వరుస పంచులతో ఈ షో ప్రతి ఒక్కర్నీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ షోకి సంబంధించిన తాజా ప్రోమో ప్రేక్షకులను మెప్పిస్తోంది.

షోలో భాగంగా హైపర్‌ ఆది టీమ్ ‘ఆయిల్‌లో సినిమా’ పేరుతో, నాన్‌ స్టాప్‌ పంచులతో సందడి చేశారు. సినిమా తీసే విధానాన్ని చూపించి నవ్వుల వర్షం కురిపించారు. స్కిట్‌లో భాగంగా అదిరే అభి.. ‘సర్‌ సీఈవో గారు అనగా.. సీఈవో నేను కాదు.. అదిగో అక్కడ కూర్చున్న న్యాయనిర్ణేతలు చీఫ్‌ ఎంటర్‌టైనింగ్‌ ఆఫీసర్స్‌ అనగా.. అలాగే నువ్వు సీఎల్వో.. చీఫ్‌ ల్యాగ్ ఆఫీసర్‌’.. అంటూ వరుస పంచులతో నవ్వులు పూయించారు. వెంకీ మంకీస్, చలాకీ చంటి, రాకెట్ రాఘవ స్కిట్లు సైతం ఆకట్టుకున్నాయి. ఆద్యంతం నవ్వుల పువ్వులు విరజిల్లే ఈ కామెడీ పరిమళాన్ని ఆస్వాదించాలంటే వచ్చే గురువారం (డిసెంబర్‌ 10)న ప్రసారం కానున్న ‘జబర్దస్త్‌’ చూడాల్సిందే. అప్పటివరకు ఈ ప్రోమోను వీక్షించండి..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని