ఆమే నాకు కరెక్ట్‌ జోడీ: రానా

కెరీర్‌లో విభిన్న పాత్రలను, కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న యువ నటుడు దగ్గుబాటి రానా. కేవలం కథానాయకుడిగానే

Updated : 25 Jul 2020 15:32 IST

హైదరాబాద్‌: కెరీర్‌లో విభిన్న పాత్రలను, కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న యువ నటుడు దగ్గుబాటి రానా. కేవలం కథానాయకుడిగానే కాదు, ప్రతినాయకుడిగానూ మెప్పించారు. త్వరలోనే ఆయన ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. మిహీకా బజాజ్‌తో ఆయన వివాహం జరగనుంది. ఆగస్టు 8న వివాహం చేసుకోబోతున్నట్లు రానా తాజాగా మరోసారి స్పష్టం చేశారు.

‘‘నేను వివాహం చేసుకునే సరైన సమయం ఇదేననుకుంటున్నా. నా ప్రేమికురాలు మిహీకా కుటుంబం మా ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. మేమంతా ఒకే ప్రాంతంలో ఉంటాం. కొన్నిసార్లు పరిస్థితులు సాఫీగా సాగిపోతుంటాయి. ఆమే నాకు కరెక్ట్‌ జోడీ. ప్రతి విషయంలోనూ ఒకరికొకరం అండగా ఉంటాం. ఆగస్టు 8న తనని వివాహం చేసుకోబోతున్నా. ఆ రోజు నా జీవితంలో అత్యుత్తమమైన, అద్భుతమైన రోజు’’ అని చెప్పుకొచ్చారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీ పెద్ద వేదికగా ఎదుగుతుందని అభిప్రాయపడిన రానా, కొత్త నటులు కూడా గుర్తించబడతారని పేర్కొన్నారు. తనకు చారిత్రక, పౌరాణిక సినిమాలు, పాత్రలంటే  ఇష్టమన్నారు. అదే సమయంలో ప్రతినాయక ఛాయలున్న పాత్రలు సైతం పోషించడానికి సిద్ధమని చెప్పుకొచ్చారు రానా. ఇక చిత్ర పరిశ్రమలో ఉన్న బంధు ప్రీతి, ఆశ్రిత పక్షపాతం గురించి మాట్లాడుతూ.. నైపుణ్యం లేకపోతే ఎవరు కూడా రాణించలేరని తెలిపారు. ‘బాహుబలి’ చిత్రం తన జీవితంలో అద్భుతమైన అంకమని ఆరేళ్ల పాటు ఎన్నో విషయాలను నేర్చుకున్నట్లు రానా చెప్పారు.

రానా కీలక పాత్రలో నటించిన ‘అరణ్య’ విడుదల కరోనా కారణంగా వాయిదా పడింది. దీంతో పాటు, ‘విరాట్‌ పర్వం’, ‘హిరణ్య కశ్యప’ తదితర చిత్రాల్లో నటిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని