Archana: ‘చోర్‌ బజార్‌’లో అర్చన

ఆకాష్‌ పూరి హీరోగా జీవన్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘చోర్‌ బజార్‌’. వీ.ఎస్‌.రాజు నిర్మించారు. గెహన సిప్పీ కథానాయిక. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 02 Mar 2022 08:46 IST

ఆకాష్‌ పూరి హీరోగా జీవన్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘చోర్‌ బజార్‌’. వీ.ఎస్‌.రాజు నిర్మించారు. గెహన సిప్పీ కథానాయిక. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సీనియర్‌ నటి అర్చన కీలక పాత్రలో   నటిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఆమె పాత్రకు సంబంధించిన లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘లవ్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. 25ఏళ్ల తర్వాత ఈ సినిమాతో మళ్లీ తెలుగు తెరపైకి వస్తున్నారు అర్చన. ఆమె పాత్ర ఈ చిత్రానికి కీలకంగా నిలుస్తుంది’’ అన్నారు. ఈ సినిమాకి సంగీతం: సురేష్‌ బొబ్బిలి, ఛాయాగ్రహణం: జగదీష్‌ చీకటి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని