‘‘అన్నయ్యా.. నాన్న లాగే నువ్వూ సూపర్‌ స్టార్‌’’

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు తనయుడు గౌతమ్‌ ఘట్టమనేని పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా మహేశ్‌, నమ్రత తమ ముద్దుల కుమారుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గౌతమ్‌ పుట్టినప్పటి ఫొటోలను ఈ సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు....

Updated : 31 Aug 2020 16:02 IST

గౌతమ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కుటుంబ సభ్యులు  

హైదరాబాద్‌: టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు తనయుడు గౌతమ్‌ ఘట్టమనేని పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా మహేశ్‌, నమ్రత తమ ముద్దుల కుమారుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గౌతమ్‌ పుట్టినప్పటి ఫొటోలను ఈ సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు. గౌతమ్‌ వచ్చాక తమ జీవితాల్లో గొప్ప మార్పు వచ్చిందంటూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. అలాగే తన గారాల చిట్టి చెల్లి సితార కూడా గౌతమ్‌కు ప్రత్యేక వీడియో సందేశం ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.    

‘14లోకి అడుగుపెట్టిన గౌత‌మ్‌కి పుట్టిన‌రోజు శుభాకాంక్షలు. నువ్వు ఓ మంచి యువ‌కుడిగా పెరుగుతున్నందుకు గ‌ర్వంగా ఉంది. డొరేమాన్ నుంచి అపెక్స్ లెజెండ్ వ‌ర‌కు నీతో క‌లిసి ప్రయాణించడం సంతోషంగా ఉంది. నీకిది గొప్ప పుట్టిన‌రోజు కావాలి. హ్యాపీ బ‌ర్త్ డే’’ అని మహేశ్‌ ట్వీట్‌ చేశారు.  

‘‘గౌతమ్ వచ్చాక మా జీవితాల్లో గొప్ప మార్పు వచ్చింది. గౌతమ్‌ మా జీవితాల్లో సంతోషం, ప్రేమను తీసుకొచ్చారు. తను ఈ ఏడాది 14వ వ‌సంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఇలాగే ప్రతి ఏడాది త‌న జీవితంలో ప్రేమ‌, సంతోషం నిండాలని కోరుకుంటున్నా’’ అంటూ నమ్రత తన ప్రియ‌మైన త‌న‌యుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.  

‘‘హాయ్ అన్నయ్యా. హ్యాపీ బర్త్ డే. నువ్వు నన్ను నమ్మవని తెలుసు. కానీ, నీ పుట్టినరోజు సందర్భంగా నేను తీసిన ఈ వీడియో అబద్ధం కాదని నమ్ముతావని అనుకుంటున్నా. నువ్వు నాకు అన్న కావటం అదృష్టం. నాన్న లాగే నువ్వు కూడా ఓ సూపర్‌ స్టార్‌ అని నేను ఊహించుకున్నా. పుట్టినరోజు శుభాకాంక్షలు. లవ్‌ యూ అన్నయ్యా’’ అంటూ ప్రత్యేక వీడియో ద్వారా గౌతమ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘క్రైమ్‌లో నాతో క‌లిసి ఉన్నా.. మొద‌ట దొరికిపోయేది నువ్వే. లవ్‌ యూ సో మచ్‌. హ్యాపీ బ‌ర్త్ డే అన్నయ్యా’’ అనే వ్యాఖ్యను వీడియోకు జతచేసింది. 
Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts