కార్తికేయ పెళ్లికబురు

యువ కథానాయకుడు కార్తికేయ ఓ ఇంటివారు కానున్నారు. లోహితారెడ్డితో కలిసి త్వరలోనే ఏడడుగులు వేయనున్నారు.

Updated : 24 Aug 2021 07:20 IST

యువ కథానాయకుడు కార్తికేయ ఓ ఇంటివారు కానున్నారు. లోహితారెడ్డితో కలిసి త్వరలోనే ఏడడుగులు వేయనున్నారు. ఈ ఇద్దరికీ ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో నిశ్చితార్థం జరిగింది. బంధువులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన కుటుంబ వేడుకలో కాబోయే జంట ఉంగరాలు మార్చుకున్నారు. లోహితారెడ్డి హైదరాబాద్‌కి చెందినవారు. కార్తికేయకి స్నేహితురాలు. వరంగల్‌ ఎన్‌.ఐ.టి కళాశాలలో ఇద్దరూ కలిసి చదువుకున్నారు. ‘ఆర్‌.ఎక్స్‌.100’తో ఘన విజయాన్ని అందుకున్న కార్తికేయ, ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో వరుస చిత్రాలతో బిజీగా గడుపుతున్నారు. ఆయన కథానాయకుడిగా ప్రస్తుతం ‘రాజా విక్రమార్క’ తెరకెక్కుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని