Bollywood: కర్వాచౌత్‌.. భార్యకు బీఎండబ్ల్యూ గిఫ్ట్‌గా ఇచ్చిన నటుడు

ప్రతి ఏడాదిలాగానే ఈ సంవత్సరం కూడా కర్వాచౌత్‌ వేడుకలను ఉత్తరాదివాసులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. జీవిత భాగస్వామి సంక్షేమాన్ని కోరుతూ వివాహమైన మహిళలందరూ ఈ వేడుకల్లో పాల్గొన్నారు...

Published : 25 Oct 2021 14:58 IST

ముంబయి‌: ప్రతి ఏడాదిలాగానే ఈ సంవత్సరం కూడా కర్వాచౌత్‌ వేడుకలను ఉత్తరాదివాసులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. జీవిత భాగస్వామి సంక్షేమాన్ని కోరుతూ వివాహితలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. బాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ సెలబ్రిటీలు సైతం ఈ పండుగను వేడుకగా జరుపుకున్నారు. భర్త, కుటుంబ శ్రేయస్సును కాంక్షిస్తూ ఉదయం నుంచి ఉపవాసం ఉండి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను శిల్పాశెట్టి, యామీ గౌతమి, నటుడు వరుణ్‌ధావన్‌, కపిల్‌ శర్మతోపాటు సెలబ్రిటీలు సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేశారు. మరోవైపు బాలీవుడ్‌ నటుడు గోవింద తన సతీమణి సునీతకు ఓ ఖరీదైన బహుమతిని అందించారు. కర్వాచౌత్‌ వేడుకల్లో భాగంగా ఖరీదైన బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చేసి.. ఆమెకు గిఫ్ట్‌గా ఇచ్చారు. తన సతీమణి ఆనందం కోసమే ఈ గిఫ్ట్‌ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.







Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని