Rakshit Shetty: అతడి సంగతి నాకు తెలియదు.. నేనైతే రష్మికతో మాట్లాడుతున్నా: రక్షిత్‌శెట్టి

కన్నడ నటుడు రక్షిత్‌ శెట్టి (Rakshit Shetty) తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. నటి రష్మిక (Rashmika) గురించి మాట్లాడారు.

Updated : 24 Sep 2023 15:31 IST

హైదరాబాద్‌: ‘చార్లీ 777’తో తెలుగువారికి చేరువైన కన్నడ నటుడు రక్షిత్‌శెట్టి (Rakshit Shetty). తాజాగా ఆయన నటించిన చిత్రం ‘స‌ప్త సాగ‌ర‌దాచే ఎల్లో’. హేమంత్ ఎం రావు దర్శకుడు. ఇదే చిత్రాన్ని తెలుగులో ‘సప్త సాగరాలు దాటి’ (Sapta Sagaralu Dhaati) పేరుతో విడుదల చేశారు. ప్రస్తుతం తెలుగువారిని అలరిస్తోన్న ఈసినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రక్షిత్‌ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా నటి రష్మిక (Rashmika) గురించి మాట్లాడారు.

‘‘నాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఇష్టం. కుటుంబసభ్యుల కోసం ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఐటీ కంపెనీలో కొంతకాలం ఉద్యోగం చేశా. ఆ తర్వాత ఫిల్మ్ మేకింగ్‌లో శిక్షణ తీసుకుని పరిశ్రమలోకి అడుగుపెట్టా. తొలి సినిమా తర్వాత జాబ్‌ మానేశా. ‘సింపుల్‌ ఆగీ ఒంద్‌ లవ్‌ స్టోరీ’తో నాకు బ్రేక్‌ వచ్చింది’’ అని అన్నారు.

social look: అనుపమ ఉవాచ.. రష్మిక ఫస్ట్‌లుక్‌.. ఇంకా ఎన్నో ముచ్చట్లు..

‘రష్మిక (Rashmika), రిషబ్‌శెట్టి (Rishab Shetty), మీరూ మంచి స్నేహితులు కదా.. ఇప్పటికీ మీ మధ్య మాటలు ఉన్నాయా?’ అని ప్రశ్నించగా.. ‘‘రిషబ్‌ శెట్టి సంగతి నాకు తెలియదు. కానీ, రష్మిక నేనూ ఇప్పటికీ మెస్సేజ్‌లు చేసుకుంటూనే ఉంటాం. నా సినిమా విడుదలైనప్పుడు విషెస్‌ తెలుపుతూ తను సందేశాలు పంపుతుంది. ఆమె సినిమా రిలీజ్‌కి నేనూ విషెస్‌ చెబుతుంటా. కెరీర్‌ విషయంలో ఆమె ఎన్నో కలలు కంది. వాటిని సాకారం చేసుకుంటూ ఆమె ఈ స్థాయిలో ఉన్నందుకు ఆనందిస్తున్నా. ఇక, పెళ్లి విషయానికి వస్తే.. ప్రస్తుతానికి నా ఫోకస్‌ మొత్తం కెరీర్‌పైనే ఉంది’’ అని తెలిపారు.

2016లో విడుదలైన ‘కిర్రిక్‌ పార్టీ’ కోసం రష్మిక - రక్షిత్‌ శెట్టి కలిసి వర్క్‌ చేశారు. యూత్‌ ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా చిత్రీకరణలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అనంతరం ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో నిశ్చితార్థం కూడా జరిగింది. అనుకోని కారణాలతో కొన్ని నెలలకే వీరిద్దరూ విడిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని