Adah Sharma : ఈ మాటలు నీరజా మాధవన్‌ చెప్పినవి: అదాశర్మ

అదాశర్మ ‘బస్తర్‌: ది నక్సల్‌ స్టోరీ’ సినిమా గురించి మాట్లాడారు.

Published : 13 Mar 2024 17:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) చిత్రంలో నటించి ప్రశంసలు అందుకున్న అదాశర్మ (Adah Sharma ) ‘బస్తర్‌: ది నక్సల్‌ స్టోరీ’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘ది కేరళ స్టోరీ’ దర్శక నిర్మాతలు సుదీప్తోసేన్‌, విపుల్‌ అమృత్‌లాల్‌ షా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బస్తర్‌ ప్రాంతంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అదాశర్మ ఈ సినిమా గురించి మాట్లాడారు.

‘‘ నక్సలిజాన్ని సపోర్ట్‌ చేస్తూ జవాన్లను గౌరవించకపోవడం తప్పు. దేశ రక్షణ కోసం జవాన్లు శత్రువులతో చేసే యుద్ధాన్ని కొన్ని సినిమాల్లో చూస్తూనే ఉన్నాం. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నామంటే కారణం జవాన్‌లు. అందరం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఈ మాటలు అదాశర్మగా కాదు ఐపీఎస్‌ నీరజా మాధవన్‌గా చెప్తున్నా. ‘బస్తర్‌’లో ఆమె ఎంత ధైర్యంగా పోరాడారో సినిమాలో చూస్తారు. నిజాన్ని గ్రహిస్తారు. ఇందులో ప్రతీ డైలాగ్‌ను నమ్ముతారు. 76 మంది జవాన్లను ఎంత క్రూరంగా హతమార్చారో తెలుసుకుంటారు. కచ్చితంగా అందరూ సినిమా చూడాలని చెప్పడం లేదు. ఇది ప్రజాస్వామ్య దేశం. సినిమా చూడాలా? వద్దా? అన్నది ప్రేక్షకుల అభిప్రాయం. ది కేరళ స్టోరీ విషయంలో ఇదే మాట చెప్పాను. ఎవరు ఎటువంటి కామెంట్స్‌ చేసినా వాటిని గౌరవిస్తాను’’ అని అదాశర్మ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని