Adipurush: తెలుగు రాష్ట్రాల్లో ‘ఆది పురుష్‌’ టికెట్‌ ధరలు పెంపు.. షోల వివరాలివే!

Adipurush: ప్రభాస్‌ ‘ఆది పురుష్‌’ మూవీ టికెట్‌ ధరలను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Updated : 13 Jun 2023 18:50 IST

హైదరాబాద్‌: ప్రభాస్‌ (Prabhas) కీలక పాత్రలో ఓం రౌత్‌ రూపొందించిన ‘ఆది పురుష్‌’ (Adipurush) మూవీ విడుదలకు సిద్ధమైంది. అగ్ర కథానాయకుల సినిమాలు విడుదలైనప్పుడు నిబంధనల మేరకు మొదటివారం టికెట్‌ ధరలను పెంచుకునేలా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ‘ఆది పురుష్‌’ టికెట్‌ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్‌లలో టికెట్‌పై రూ.50 పెంచింది. మొదటి మూడు రోజులు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఆరో షోకూ అనుమతి ఇచ్చింది. ఉదయం 4గం.ట నుంచి ‘ఆది పురుష్‌’ను థియేటర్‌లలో ప్రదర్శించవచ్చు. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్‌లో ప్రస్తుతం టికెట్‌ ధర రూ.175 ఉండగా, దీనికి అదనంగా రూ.50 చెల్లించాలి. 3డీ సినిమా ప్రదర్శితమయ్యే థియేటర్‌లలో గ్లాస్‌లకు అదనపు ధర చెల్లించాలి. అలాగే మల్టీప్లెక్స్‌లో రూ.295+ 3డీ గ్లాస్‌ల ఛార్జ్‌ వసూలు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా టికెట్‌ ధరపై రూ.50 పెంచినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని