Kalyan ram: అమిగోస్‌ స్టైలిష్‌

కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘అమిగోస్‌’. ఆషికా రంగనాథ్‌ కథానాయిక.

Updated : 02 Jan 2023 08:04 IST

కల్యాణ్‌రామ్‌ (Kalyan Ram) కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘అమిగోస్‌’ (Amigos). ఆషికా రంగనాథ్‌ కథానాయిక. రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మాతలు. ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. జనవరి 1 సందర్భంగా ఆదివారం ఈ సినిమాలోని కొత్త ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది చిత్రబృందం. అందులో సిద్ధార్థ్‌ అనే పాత్రలో స్టైలిష్‌ లుక్‌తో దర్శనమిస్తున్నారు కల్యాణ్‌రామ్‌. ఇందులో మూడు కోణాల్లో సాగే పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. మనిషిని పోలిన మనిషిగా ఆయన కనిపించనున్నట్టు తెలుస్తోంది. ‘బింబిసార’తో గతేడాది ఘన విజయాన్ని సొంతం చేసుకున్న కల్యాణ్‌రామ్‌ నుంచి ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొస్తున్న చిత్రాల్లో ఇదొకటి. సంగీతం: జిబ్రాన్‌, ఛాయాగ్రహణం: సౌందర్‌రాజన్‌.ఎస్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌: అవినాష్‌ కొల్లా, కూర్పు: తమ్మిరాజు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని