Anand Deverakonda: ‘బేబీ’పై నెటిజన్‌ తీవ్ర విమర్శలు.. ఆనంద్‌ దేవరకొండ స్ట్రాంగ్‌ కౌంటర్‌

తాను నటించిన చిత్రాన్ని ఉద్దేశిస్తూ కామెంట్‌ చేసిన ఓ నెటిజన్‌పై నటుడు ఆనంద్‌ దేవరకొండ (Anand Deverakonda) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 08 Jul 2023 14:33 IST

హైదరాబాద్‌: విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) సోదరుడు, నటుడు ఆనంద్‌ దేవరకొండ (Anand Deverakonda) హీరోగా తెరకెక్కిన సరికొత్త చిత్రం ‘బేబీ’ (BABY). సాయి రాజేశ్‌ దర్శకుడు. జులై 14న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం శుక్రవారం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో సినిమాలోని హీరోయిన్‌ లుక్స్‌ను ఉద్దేశిస్తూ ఓ నెటిజన్‌ తీవ్ర విమర్శలు చేశాడు. యూట్యూబ్‌ షార్ట్‌ను ఫీచర్‌ ఫిల్మ్‌గా చేస్తే ఇలాగే ఉంటుందని అన్నాడు.

‘‘తీవ్ర విమర్శలు వచ్చిన వేళ ఫెయిర్‌ అండ్‌ లవ్లీ కూడా తన పేరును గ్లో అండ్‌ లవ్లీగా మార్చుకుంది. అలాంటిది 2023లో నలుపు, తెలుపు శరీర రంగును ఉద్దేశించేలా తెరకెక్కిన ‘బేబీ’ లాంటి సినిమాలను మనం ఇంకా చూస్తున్నాం. ఒక యూట్యూబ్‌ షార్ట్‌ను పూర్తిగా స్థాయి చిత్రంగా మారిస్తే ఇలాగే ఉంటుంది’’ అని నెటిజన్‌ విమర్శ చేయగా.. ఆనంద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇప్పుడు ఈ విషయంపై వివాదం చేయడం అనవసరం అనుకుంటున్నా. సినిమా చూసిన తర్వాత కామెంట్‌ చేసి ఉంటే బాగుండేది’’ అని ఆయన అన్నారు.

ఇదీ చదవండి: విజయ్‌ దేవరకొండతో పోటీ.. ఆనంద్‌ రియాక్షన్‌ ఏంటంటే?

‘హైవే’ తర్వాత ఆనంద్‌ దేవరకొండ నటిస్తోన్న చిత్రమిది. సాయి రాజేశ్‌ దర్శకుడు. వైష్ణవి చైతన్య కథానాయిక. ఇప్పటివరకూ విడుదలైన ప్రచార చిత్రాలు చూస్తే ఇదొక ట్రయాంగిల్‌ ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకున్నట్లు తెలుస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని