Anand Deverakonda: విజయ్‌ దేవరకొండతో పోటీ.. ఆనంద్‌ రియాక్షన్‌ ఏంటంటే?

ఆనంద్‌ దేవరకొండ హీరోగా సాయి రాజేశ్‌ తెరకెక్కించిన చిత్రం ‘బేబీ’. ఈ సినిమా ట్రైలర్‌ విడుదల వేడుకలో తన సోదరుడు విజయ్‌తో పోటీ గురించి ప్రశ్న ఎదురవ్వగా ఆనంద్‌ స్పందించాడు.

Published : 07 Jul 2023 21:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) సోదరుడిగా తెరంగేట్రం చేసినా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు ఆనంద్‌ దేవరకొండ (Anand Deverakonda). ‘దొరసాని’, ‘మిడిల్‌క్లాస్‌ మెలొడీస్‌’, ‘పుష్పక విమానం’తో ఆకట్టుకున్న ఆయన ‘బేబీ’ (Baby)తో ప్రేక్షకుల అలరించేందుకు సిద్ధమయ్యాడు. సాయి రాజేశ్‌ తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ‘ఏఏఏ సినిమాస్‌’లో ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ట్రైలర్‌ విడుదల (Baby Trailer) అనంతరం చిత్ర బృందం మీడియాతో ముచ్చటించింది.

‘విజయ్‌, మీ యాక్టింగ్‌ ఒకేలా ఉంది. భవిష్యత్తులో మీ ఇద్దరి మధ్య పోటీ ఉంటుందా?’ అనే ప్రశ్న ఎదురవ్వగా ఆనంద్‌ ఇలా స్పందించాడు. జీవితంలో ఏం చేసినా ఆనందంగా ఉండాలనుకుంటానని, పోటీ గురించి ఆలోచిస్తే సృజనాత్మకత పోతుందన్నాడు. పోటీ పడే స్థాయికి తానింకా వెళ్లలేదని చెప్పాడు. దీనిపై దర్శకుడు స్పందిస్తూ.. ‘‘విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌.. ఆనంద్‌పై, ఆనంద్‌ అభిమానులు విజయ్‌పై ట్రోల్ చేస్తుంటే చూడాలని ఉంది. ఆ రేంజ్‌కి వెళ్లాలని ఆనంద్‌కి చెప్పా. ఏదో ఒకరోజు అది జరుగుతుంది’’ అని నవ్వుతూ సమాధానమిచ్చాడు. ‘బేబీ’కి ‘కలర్‌ ఫొటో’, ‘ప్రేమదేశం’ సినిమాలకి సంబంధం ఉండదని స్పష్టం చేశాడు. నటనకు అధిక ప్రాధాన్యమున్న పాత్ర తొలి ప్రయత్నంలోనే తనకు దక్కడంపై హీరోయిన్‌ వైష్ణవీ చైతన్య ఆనందం వ్యక్తం చేసింది. ‘బేబీ’లో రియాలిటీని చూపించనున్నట్టు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు