Ananya Nagalla: పెళ్లి ఎప్పుడన్నది కాలమే నిర్ణయిస్తుంది.

‘మల్లేశం’ నటి అనన్య నాగళ్ల ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి మాట్లాడారు.

Published : 13 Mar 2024 20:41 IST

హైదరాబాద్‌: ‘మల్లేశం’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి అనన్య నాగళ్ల (Ananya Nagalla). పవన్‌ కళ్యాన్‌ నటించిన ‘వకీల్‌సాబ్‌’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోయిన్‌గా, సహాయనటిగా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు అనన్య. త్వరలో ఆమె ‘తంత్ర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకురానున్నారు. ఈ సినిమాలో ధనుష్‌ రఘుముద్రి, సలోని కీలక పాత్రలు పోషించారు. శ్రీనివాస్‌ గోపీశెట్టి దర్శకత్వం వహించారు. ఈ సినిమా మార్చి 15న విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.  

‘‘ఈ సినిమా కథని నమ్మి చేసింది. మొత్తం సినిమాను నడిపించే బలమున్న పాత్రకు నేను న్యాయం చేయగలను అని నాకు అనిపించింది. అందుకే ఈ చిత్రంలో భాగం అయ్యాను. ఈ సినిమా మంచి థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది. ఇందులో అనన్యను సరికొత్తగా చూస్తారు. దీని తర్వాత వరుస సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ప్రేమ పెళ్లా? తల్లిదండ్రులు సూచించిందా? అంటే అది కాలమే నిర్ణయిస్తుంది. ఈ జనరేషన్‌ వాళ్లకు ప్రేమ, పెళ్లి గురించి తెలీదు. ముఖ్యంగా పరిశ్రమలో ఇప్పుడున్న వారికి జీవితంపై సరైన అవగాహన లేదు. అందుకే పెళ్లి చేసుకున్నా ఇండస్ట్రీలో వారిని చేసుకోను’’ అని అనన్య తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని