Anasuya: పండుగాడిని పట్టుకుంటే...

సునీల్‌, అనసూయ భరద్వాజ్‌ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘వాంటెడ్‌ పండుగాడ్‌’. పట్టుకుంటే కోటి...అనేది ఉపశీర్షిక. శ్రీధర్‌ సీపాన దర్శకత్వం వహిస్తున్నారు. సాయిబాబ కోవెలమూడి, వెంకట్‌ కోవెలమూడి నిర్మాతలు. కె.రాఘ  వేంద్రరావు

Updated : 16 May 2022 10:57 IST

సునీల్‌, అనసూయ భరద్వాజ్‌ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘వాంటెడ్‌ పండుగాడ్‌’. పట్టుకుంటే కోటి...అనేది ఉపశీర్షిక. శ్రీధర్‌ సీపాన దర్శకత్వం వహిస్తున్నారు. సాయిబాబ కోవెలమూడి, వెంకట్‌ కోవెలమూడి నిర్మాతలు. కె.రాఘ  వేంద్రరావు సమర్పకులు. ఆదివారం   అనసూయ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె ఫస్ట్‌లుక్‌తోపాటు, ప్రచార వీడియోని విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘హాస్య ప్రధానంగా రూపొందుతున్న చిత్రమిది. ప్రముఖ రచయిత జనార్ధన మహర్షి కథ, మాటలతోపాటు స్క్రీన్‌ప్లే సమకూర్చారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. బ్రహ్మానందం, రఘుబాబు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: మహిరెడ్డి   పండుగుల, సంగీతం: పీఆర్‌.


‘హిడింబ’ యాక్షన్‌

శ్విన్‌బాబు కథానాయకుడిగా ఎస్వీకే సినిమాస్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘హిడింబ’. నందితా శ్వేత  కథానాయిక. అనిల్‌ కన్నెగంటి దర్శకత్వం వహిస్తున్నారు. గంగపట్నం శ్రీధర్‌ నిర్మాత. ఈ చిత్రానికి సంబంధించిన తొలి ప్రచార చిత్రం విడుదలైంది. యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ సినిమా ప్రచార చిత్రంలో అందుకు తగ్గట్టే కనిపించారు కథానాయకుడు. ‘‘అశ్విన్‌ ఓ శక్తివంతమైన పాత్రని చేశారు. నందిత శ్వేత పోలీస్‌గా కనిపించింది. శుభలేఖ సుధాకర్‌ రాజకీయ నాయకుడిగా కనిపించార’’ని సినీ వర్గాలు తెలిపాయి. దీనికి సంగీతం: వికాస్‌ బాడిసా, ఛాయాగ్రహణం: రాజశేఖర్‌.బి.


‘రైడ్‌’ చేయనున్న హరీష్‌?

‘గబ్బర్‌సింగ్‌’ దర్శకుడు హరీష్‌ శంకర్‌ ఓ బాలీవుడ్‌ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయనున్నట్లు సమాచారం. 2018లో విడుదలైన అజయ్‌ దేవ్‌గణ్‌ ‘రైడ్‌’ను ఈ దర్శకుడు రీమేక్‌ చేయనున్నాడని కొన్ని హిందీ సైట్లు పేర్కొన్నాయి. లఖ్‌నవూలో జరిగిన యధార్థ ఘటనల  ఆధారంగా తెరకెక్కిన చిత్రమది. అజయ్‌ ఇందులో అమయ్‌ పట్నాయక్‌ అనే ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారిగా కనిపిస్తాడు. రీమేక్‌ వార్తలు గనక నిజమైతే ఇందులో కథానాయకుడిగా హరీష్‌ ఎవరిని ఎంచుకుంటాడన్నది ఆసక్తికరం. ప్రస్తుతం హరీష్‌ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ పూర్తయిన అనంతరం ఈ రీమేక్‌ సెట్స్‌ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని