Updated : 27 May 2022 08:07 IST

Pakka Commercial: అందాల రాశీ.. స్వరాలాపన

గోపీచంద్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పక్కా కమర్షియల్‌’. జీఏ2 పిక్చర్స్‌, యూవీ క్రియేషన్స్‌ పతాకాలపై బన్నీ వాస్‌ నిర్మించారు. రాశి ఖన్నా కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ఈ సినిమా జులై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్ని వేగవంతం చేస్తోంది చిత్ర బృందం. ఇందులో భాగంగా జూన్‌ 1న ఈ చిత్రం నుంచి ‘‘అందాల రాశీ’’ అనే గీతాన్ని విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని  గురువారం సామాజిక మాధ్యమాల వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పాటకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను సినీప్రియులతో పంచుకున్నారు. అందులో గోపీచంద్‌, రాశి ఖన్నా కలర్‌ఫుల్‌ దుస్తుల్లో స్టైలిష్‌గా స్టెప్పేస్తూ కనిపించారు. ‘‘టైటిల్‌కు తగ్గట్లుగానే పక్కా కమర్షియల్‌ హంగులతో రూపొందిన చిత్రమిది. నిర్మాణాంతర పనులు కొనసాగుతున్నాయి’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. సంగీతం: జేక్స్‌ బిజోయ్‌, ఛాయాగ్రహణం: కరమ్‌ చావ్ల.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts